PM Modi: మోదీ విశాఖ పర్యటనకు ముహూర్తం ఫిక్స్.. మూడు రాజధానులపై ఏం చెబుతారంటే?

PM Modi:  ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటనకు రానున్నారు. వచ్చే నెలలో మోదీ విశాఖ టూర్ కు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీజేపీ నేతలు దీనిపై క్లారిటీ ఇస్తున్నారు. మోదీ విశాఖకు వస్తారన గతంలో జోరుగా ప్రచారం జరిగింది. కానీ మోదీ విశాఖపట్నానికి రాలేదు. విశాఖలో రైల్వే జోన్ భవనాలను ప్రారంభించడానికి మోదీ వస్తారంటూ ఇటవల బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ ప్రకటించారు. ఇక ఇటీవల బీజేపీ రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహరావు కూడా ఇదే విషయాన్ని చెప్పుకొచ్చారు. అయితే భోగాపురంలో నిర్మాణం చేయనున్న అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్ కు మోదీతో శంకుస్థాపన చేయించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది.

ఇప్పటికే మోదీకి ఏపీ ప్రభుత్వం ఆహ్వానం పంపింది. మోదీ కూడా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఎయిర్ పోర్టు శంకుస్థాపన కార్యక్రమానిక వచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు చెబుతున్నారు. దీంతో అన్ని కార్యక్రమాలను ఒకేసారి మోదీ కోసం ప్లాన్ చేసినట్లు బీజేపీ నేతలు చెబుతున్నారు. అలాగే విభజన హామీలల ోభాగంగా విజయనగరం జిల్లాకు మంజురైన కేంద్రీయ గిరిజన యూనివర్సిటీ సొంత భవన నిర్మాణాలకు కూడా మోదీ శంకుస్ధాపన చేస్తారని బీజేపీ నేతలు అంటున్నారు. ఈ మూడు కార్యకర్తలను ఒకేరోజు ప్లాన్ చేశారని, ఈ మూడు కార్యక్రమాల్లో పాల్గొనేందుకకు మోదీ విశాఖకు వచ్చే నెులలో రానున్నారని బీజేపీ నేతలు వెల్లడించారు.

అయితే మోదీ విశాఖపట్నానికి రాక నాలుగేళ్లు అవుతుంది. 2019 మార్చిలో విశాఖకు వచ్చిన ప్రధాని మోదీ. .విశాఖ రైల్వే జోన్ ప్రకటన చేశరాు. ఆ తర్వాత రెండో దఫా ప్రధానమంత్రి అయి తర్వాత మోదీ ఇప్పివరకు విశాఖపట్నంలో అడుగుపెట్టలేదు. ఇప్పుడ నవంబర్ లో మోదీ రానుండటంతో ప్రభుత్వ వర్గాలు పర్యటనకు ఏర్పాట్లు చేస్తున్నాయి. అయితే విశాఖపట్నం కేంద్రంగా మూడు రాజధానుల ఉద్యమానికి వైసీపీ శ్రీకారం చుట్టడం, ఉత్తరాంధ్రలో మూడు రాజధానులపై టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. మూడు రాజధానులపై ఏపీ రచ్చ జరుగుతున్న క్రమంలో మోదీ దీనిపై స్పందిస్తారా.. లేదా అనేది చర్చనీయాంశంగా మారింది.

మూడు రాజధానులపై మోదీ తేల్చేస్తారా.. ఏదైనా క్లారిటీ ఇస్తారా అనేది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అమరావతికే తమ మద్దతు అని, మూడు రాజధానులకు వ్యతిరేకమంటూ కేంద్రమంత్రులు ఏపీ పర్యటను వచ్చిన సమయంలో చెబుతున్నారు. రాష్్ర బీజేపీ నేతలు అమారావతికే మద్దతు అంటూ చెబుతున్నారు. దీంతో అమరావతికే మోదీ కట్టుబడి ఉంటారా.. లేదా అనేది హాట్ టాపిక్ గా మారింది. శంకుస్ధాపన సమయంలో ఏర్పాటు చేసే సభల్లో మాట్లాడాలల్సి ఉంటుంది. దీంతో మోదీ ఏం మాట్లాడుతారనేది చర్చకు దారితీసింది. రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారరుతున్నాయి. బీజేపీకి జనసేన అధినేత పవన్ కల్యాణ్ దూరం జరగుతున్నాయి. ఆయన టీడీపీకి దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు చేస్తోన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు బీజేపీకి దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు చేస్తోన్నారు. ఇలాంటి తరుణంలో ఏపీలోని రాజకీయ పరిణామాలపై మోదీ ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారనేది హాట్ టాపిక్ గా మారింది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -