Mokshagna: స్టార్ హీరో కావడానికి మోక్షజ్ఞ అలా చేస్తున్నారా?

Mokshagna: నందమూరి అభిమానులను ఎంతగానో వేచి చూసేలా చేస్తున్న విషయం ఏంటో తెలుసా? అదే నందమూరి మరో తరం వారసుడు మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీ. ఎప్పటి నుండో మోక్షజ్ఞ ఎంట్రీ గురించి వార్తలు వినిపిస్తున్న ఇంకా దీనిపై క్లారిటీ రాలేదు. అయితే ఈ విషయాన్ని చాలా సార్లు చాలా వేదికలపై ధృవీకరించారు. కానీ ఎప్పుడు, ఎలా మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందో మాత్రం ఎవ్వరు ప్రకటించలేదు. దీనితో నందమూరి అభిమానులు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం వేయి కళ్ళతో వేచి చూస్తున్నారు. ప్రస్తుతం మోక్షజ్ఞకు సంబంధించి ఒక వార్త ట్రెండ్ అవుతోంది.

 

మోక్షజ్ఞ ఎంట్రీ కోసం సర్వం సిద్ధం చేస్తున్నట్టు కనిపిస్తోంది. సినిమాల్లో ప్రదర్శన కోసం కావలిసిన అన్ని రంగాల్లో, అన్ని అంశాల్లో ఇప్పటికే మోక్షజ్ఞ అద్భుతమైన నైపుణ్యాన్ని కలిగి ఉన్నాడని టాక్ వినిపిస్తుంది. అయితే మోక్షజ్ఞ నైపుణ్యానికి మరింత మెరుగులు దిద్దడానికి ప్రస్తుతము కసరత్తులు జరుగుతున్నట్టు తెలుస్తుంది. సరైన సమయంలో మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశం కోసం అన్ని ఏర్పాట్లు చేయడంలో భాగంగా.. నైపుణ్య శిక్షణ కూడా తీసుకుంటున్నట్టు సమాచారం.

 

మోక్షజ్ఞ ప్రస్తుతం డ్యాన్స్, ఫైట్లలో ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నారని తెలుస్తోంది. అయితే ఇప్పటికే అన్ని రంగాల్లో రాటుదేలిన మోక్షజ్ఞ.. శిక్షకులే ఆశ్చర్యపోయేలా డ్యాన్స్, ఫైట్లు చేస్తున్నారని సమాచారం. వారు ఊహించని దానికంటే అద్భుతమైన రీతిలో మోక్షజ్ణ పర్ఫామెన్స్ ఉండడంతో , ఇక మోక్షజ్ఞ ను ఎవ్వరు ఆపలేరు.. శభాష్ మోక్షజ్ఞ, గ్రేట్ అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఇక దీనితో మోక్షజ్ఞ అన్ని రకాల సినీ రంగ ప్రవేశానికి సిద్ధంగా తయారవుతున్నదని ఇండస్ట్రీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

 

ఇప్పటికే మోక్షజ్ఞ ఎంట్రీపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఇక ప్రస్తుతము మోక్షజ్ఞ డాన్స్, ఫైట్స్ అత్యుత్తమంగా చేస్తున్నాడని తెలియడంతో.. నందమూరి అభిమానులు మరింత ఉత్సాహంతో మోక్షజ్ఞ ఎంట్రీ కోసం ఉవ్విళ్లూరుతున్నారు. ఈ విషయాలన్నీ చూస్తూ ఉంటే మోక్షజ్ఞ ఎంట్రీ తోనే భారీ హిట్ కొట్టే సూచనలు కనిపిస్తున్నాయని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ ప్రారంభమైంది.

Related Articles

ట్రేండింగ్

Asaduddin Owaisi-PM Modi: ముస్లింలే ఎక్కువ కండోమ్స్ వాడుతున్నారు.. వైరల్ అవుతున్న అసరుద్దీన్ ఒవైసీ కౌంటర్!

Asaduddin Owaisi-PM Modi:  మొదటి దశ ఎన్నికల పోలింగ్ తరువాత రాజస్థాన్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ప్రధాని నరేంద్ర మోదీ. ఆ క్రమంలో ఆయన ముస్లింలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా...
- Advertisement -
- Advertisement -