Balakrishna: గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా డాడీ.. బాలయ్యతో మోక్షజ్ఞ ఇంత సంస్కారహీనంగా మాట్లాడతారా?

Balakrishna: నందమూరి నటసింహం బాలకృష్ణ ఈ మధ్యకాలంలో వరుస సినిమాలలో నటిస్తూ హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నారు. ఇలా వరుస సినిమాలలో నటిస్తూ ఉన్నటువంటి ఈయన దసరా పండగ సందర్భంగా భగవంతుకేసరి అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈ సినిమాలో బాలయ్య సరసన కాజల్ అగర్వాల్ నటించగా ఈయనకు కూతురు పాత్రలో నటి శ్రీ లీల నటించారు.

ఇక ఈ సినిమా నుంచి ఇప్పటికి విడుదలైనటువంటి పాటలు ట్రైలర్ పోస్టర్స్ అన్నీ కూడా ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో సినిమాపై భారీ అంచనాలు పెరిగిపోయాయి.ఇక ఈ సినిమా అక్టోబర్ 19వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో తాజాగా చిత్ర బృందం ట్రైలర్ లాంచ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా బాలకృష్ణ మాట్లాడినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

ఈ సినిమాలో శ్రీ లీల తనకు కూతురు పాత్రలో నటించింది అయితే భవిష్యత్తులో తనతో హీరోగా ఒక సినిమా చేయాలని ఉంది అంటూ బాలకృష్ణ వెల్లడించారు. ఈ విధంగా బాలయ్య ఇదే విషయాన్ని తన కుటుంబ సభ్యుల దగ్గర చెప్పడంతో తన కొడుకు తనని తిట్టాడు అంటూ ఈ సందర్భంగా బాలయ్య తెలిపారు. శ్రీ లీలతో నటించాలని ఉంది అంటూ తాను చెప్పగానే ఏంటి డాడీ నేను యంగ్ హీరోగా ఇండస్ట్రీలోకి వస్తున్నాను నువ్వు తనతో నటించడం ఏంటి.. గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా అంటూ తన కొడుకు తనని తిట్టాడని బాలయ్య తెలిపారు.

ఇలా మోక్షజ్ఞ తనని తిట్టాడు అంటూ బాలయ్య కామెంట్ చేయడంతో ఈ వ్యాఖ్యలపై చాలామంది విమర్శలు చేస్తున్నారు. బాలకృష్ణ ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో అందరి ముందు తన కొడుకు పరువు తీయడమే కాకుండా తన పరువు తీసుకున్నట్టు కాదా అయినా తండ్రిని ఇలా మాట్లాడే అంత సంస్కారహీనుడా మోక్షజ్ఞ అంటూ బాలయ్య వ్యాఖ్యలపై నెటిజన్స్ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. బాలకృష్ణ ఎన్టీఆర్ గారికి ఎంత గౌరవం ఇస్తారో మనకు తెలిసిందే.కనీసం ఆ గౌరవం తన కొడుకు నుంచి పొందలేకపోతున్నారా అంటూ అందరూ షాక్ అవుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

BJP-YSRCP: బీజేపీ, వైసీపీ మధ్య ప్రేమ కొనసాగుతోందా.. బీజేపీ వెన్నుపోటు వెనుక కారణాలివేనా?

BJP-YSRCP: ఆంధ్రప్రదేశ్లో మరొక రెండు వారాలలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ తరుణంలోని ఎన్నికల హీట్ భారీగా పెరిగిపోయింది అయితే ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు చూస్తుంటే మాత్రం కాస్త విచిత్రంగానే ఉన్నాయని చెప్పాలి. కేంద్రంలో ఉన్నటువంటి...
- Advertisement -
- Advertisement -