Balakrishna-Mokshagna: మోక్షజ్ఞ ఫస్ట్ మూవీ గురించి షాకింగ్ కామెట్స్ చేసిన బాలయ్య.. ఇప్పట్లో మూవీ లేదంటూ?

Balakrishna-Mokshagna: నందమూరి అభిమానులు ఎప్పటినుంచో బాలయ్య బాబు తనయుడు మోక్షజ్ఞ నీకోసం ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. కానీ ఏడాదిలో అలా వచ్చి ఇలా వెళ్ళిపోతున్నాయి కానీ మోక్షజ్ఞ ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడు అన్న విషయం మాత్రం తేలడం లేదు. మోక్షజ్ఞ ఎంట్రీ కోసం అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇప్పటివరకు సోషల్ మీడియాలో మోక్షజ్ఞ ఎంట్రీ పై వందల సంఖ్యలో గాసిప్స్ వినిపించాయి. కానీ అవన్నీ ఒట్టి రూమర్స్ గానే మిగిలిపోయాయి.

అయితే మోక్షజ్ఞ ఎంట్రీ పై వార్తలు వినిపించిన ప్రతిసారి అభిమానులు నిజమే అని నమ్ముతూ వచ్చారు. ఇలా ఉంటే తాజాగా బాలకృష్ణ తన కొడుకు ఎంట్రీ పై స్పందించారు. తన కొడుకు మోక్షజ్ఞ వచ్చే ఏడాది డెబ్యూ ఇస్తాడని, అతడి కెరీర్ పై తనకు ఎలాంటి టెన్షన్ లేదని, ఒక్క రాత్రి సమయం చాలని అంటున్నారు. ఈ సందర్భంగా బాలయ్య బాబు మాట్లాడుతూ.. మోక్షజ్ఞ మొదటి సినిమా ఎవరితో అనేది నాకు తెలీదు. ఎందుకంటే నేను మెంటల్లీ అలా ప్రిపేర్ అవ్వను. ఏవీ ప్లాన్ చేయను. రేపు షూటింగ్ అంటే, ఈరోజు కథ రెడీ అయిపోతుంది. నాకు ఒక్క రాత్రి చాలు. నేను అంత స్పీడ్ గా ఉంటాను.

నా స్పీడ్ ఎవ్వరూ తట్టుకోలేరు. మోక్షజ్ఞ భవిష్యత్ గురించి నాకు అస్సలు దిగులు లేదు. ఎందుకంటే, నా దగ్గరే బోలెడన్ని సబ్జెక్టులు ఉన్నాయి. కథలకు కొదవలేదని, ఎటొచ్చి మంచి దర్శకుడు కావాలని అన్నారు బాలయ్య. తన దర్శకత్వంలో మోక్జజ్ఞ సినిమా ఉంటుందని, కానీ ఎప్పుడో చెప్పలేనని అన్నారు. మోక్షుతో మొదటి సినిమా నాదే కావొచ్చు, లేదా రెండో సినిమా ఉండొచ్చు. ఆదిత్య-999 మ్యాక్స్ మాత్రం రెడీగా ఉంది. ఒక్క రాత్రిలో రెడీ చేశాను ఆ కథ. అది కూడా ఆ రాత్రి నేను పడుకున్నాను, కథ ఆసువుగా వచ్చేసింది. ఇంకో కథ కూడా రెడీ చేసి పెట్టాను. ఇలా మరో 4-5 కథలు ఉన్నాయి. కాబట్టి మోక్షు ఫ్యూచర్ గురించి నాకు దిగులే లేదు. నా దగ్గర కథలు ఉన్నాయి. ఎటొచ్చి మంచి దర్శకుడు దొరకాలంతే అని కొడుకు ఎంట్రీ పై క్లారిటీ ఇచ్చేశారు బాలయ్య బాబు. ప్రస్తుతం బాలయ్య బాబు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి..

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: జనసేన పార్టీ నేతలకు కీలక ఆదేశాలు ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ఆ నేతలు పాటిస్తారా?

Pawan Kalyan:  పవన్ కళ్యాణ్ లో ఇప్పుడు పరిపూర్ణ రాజకీయ నాయకుడు కనిపిస్తున్నాడు. పార్టీకి సంబంధించి అనేకమైన కీలక నిర్ణయాలను చాలా పరిణితితో తీసుకుంటున్నారు. పోలింగ్ రెండు వారాల్లో ఉంది కాబట్టి ఈ...
- Advertisement -
- Advertisement -