Mokshagna-Sreeleela: శ్రీలీలతో మోక్షజ్ఞ ప్రేమలో ఉన్నారా.. శ్రీలీల నందమూరి కోడలు అయ్యే అవకాశం ఉందా?

Mokshagna-Sreeleela: ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం శ్రీలీల చుట్టూనే తిరుగుతూ ఆమె నామజపం చేస్తోంది. ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన చాలా తక్కువ పీరియడ్ లో ఎక్కువ సినిమాలు చేసింది శ్రీ లీల. దాదాపు ప్రతి హీరోని కవర్ చేసింది. అయితే ఈమె వచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకుంది, ప్రతి సినిమాలోని తన టాలెంట్ తో విమర్శకులను సైతం మెప్పించగలిగింది ఈ భామ. ఈమె రీసెంట్ గా బాలకృష్ణతో భగవంత్ కేసరి సినిమాలో నటించింది.

ఇందులో వీళ్ళిద్దరూ తండ్రి కూతుర్లుగా నటించారు. సినిమాకి సంబంధించిన ఈవెంట్లో బాలకృష్ణ తనకి తండ్రిలేని లోటు తీర్చారని, తను మిస్ అయిన ప్రతి ఫీలింగ్ ని ఆయన ఇచ్చారని చాలా ఎమోషనల్ అయింది శ్రీ లీల. అలాగే బాలకృష్ణ కూడా శ్రీ లీలతో తన ఎక్స్పీరియన్స్ గురించి చెప్పుకొచ్చాడు. దాంతోపాటు ఇంట్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించి కూడా చెప్పాడు. శ్రీలీల ఈసారి కూతురుగా నటించింది కానీ నెక్స్ట్ టైం హీరోయిన్ గా నటిస్తుంది అని చెప్పటంతో మోక్షజ్ఞ ఒప్పుకోలేదు.

గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా?తను నా పిల్ల అని వార్నింగ్ ఇచ్చాడు అని చెప్పకు వచ్చాడు బాలకృష్ణ. అయితే బాలకృష్ణ ఆ మాట ఏదో ఫ్లోలో అని ఉంటాడు, ఎందుకంటే బాలకృష్ణ మైక్ పట్టుకుంటే ఏం మాట్లాడుతాడో తనకే తెలియదు అని సర్ది చెప్పుకున్నారు ప్రేక్షకులు. అయితే రీసెంట్ గా కొన్ని ఫోటోలని చూస్తే బాలకృష్ణ ఊరికే అలా మాట్లాడలేదని, దాని వెనుక పెద్ద స్టోరీ నే ఉందని తెలుస్తుంది. ఇంతకీ ఏం జరిగిందంటే తమన్ ఈ మధ్యనే భగవంత్ కేసరి టీం తో భేటీ అయ్యాను అంటూ ఒక ఫోటోని షేర్ చేశాడు.

అందులో టీం సభ్యులతో పాటు శ్రీ లీల పక్కనే మోక్షజ్ఞ ఉండటం చూసి ప్రేక్షకులు ఒక నిర్ధారణకి వచ్చారు. అంతేకాదు ఈ మధ్య మోక్షజ్ఞ, శ్రీ లీల కలిసి దిగిన ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి.ఇంక జనాల ఊహలకి అంతేముంది వాళ్ళిద్దరూ ప్రేమలో ఉన్నారని, త్వరలోనే శ్రీ లీల బాలకృష్ణ ఇంటి కోడలు అవుతుందని వార్తలు తెగ హల్చల్ అవుతున్నాయి. మరి దీనిపై బాలకృష్ణ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.

Related Articles

ట్రేండింగ్

Chiranjeevi: చిరంజీవిపై విషం చిమ్మడం పాత్రికేయమా.. ఇది వ్యభిచారం కాదు వెబ్ చారమ్ అంటూ?

Chiranjeevi: ప్రస్తుత కాలంలో ఒక్కొక్క మీడియా సంస్థ ఒక్కొక్క రాజకీయ పార్టీకి కొమ్ముకాస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ప్రత్యేకించి కొన్ని రాజకీయ పార్టీలు ప్రత్యేకించి చానల్స్ పెట్టుకోవడం కూడా గమనార్హం. అయితే ఒక...
- Advertisement -
- Advertisement -