Balakrishna-Mokshagna: నీకు శ్రీలీల అవసరమా అంటూ మోక్షజ్ఞకు వార్నింగ్ ఇచ్చిన బాలయ్య.. ఏం జరిగిందంటే?

Balakrishna-Mokshagna: ఒక సంవత్సరంలో ఎన్ని పండుగలు వస్తే అన్ని పండుగలకి బాలకృష్ణ తనయుడు అయిన మోక్షజ్ఞ సినిమా గురించి ఏదైనా ప్రకటన వస్తుందేమో అని నందమూరి అభిమానులు వేయికనులతో ఎదురు చూస్తూ ఉంటారు. ఎదురు చూడడం, ఆపై నిరాశ పొందడం అనేది చాలా సంవత్సరాలుగా అలవాటైపోయిన ఆనవాయితీ. కానీ ఈసారి ఎందుకో ఆ నమ్మకం నిజమవుతుంది అనిపిస్తుంది.

ఎందుకంటే ఈమధ్య బాలయ్య తన వెన్నంటే తన కొడుకు మోక్షజ్ఞని ప్రతి ఈవెంట్లోకి తీసుకొని వెళ్తున్నారు. తన సినిమా సెట్లకి తీసుకుని వెళ్లి అక్కడ ఉన్న మనుషులతో పరిచయాలు కూడా పెంచుతున్నాడు. ఇప్పటివరకు తను ఎంత నేర్చుకున్నాడో తెలుసుకొని ఇంక సినిమాలోకి ఎంట్రీ ఇచ్చేలా చేస్తున్నాడు బాలయ్య. అయితే ఇప్పటివరకు మోక్షజ్ఞ చాలా బొద్దుగా ఉండేవాడు కానీ ఈ మధ్య తను బాగా షేప్ అప్ అయ్యి ఊర మాస్ హీరో మెటీరియల్ ఆ తయారవడంతో ప్రేక్షకులు ఆనందాలకు హద్దులు లేకుండా పోతుంది.

ఒక మంచి సినిమా పడితే చూడాలి అని నందమూరి ప్రేక్షకులు ఆశగా చూస్తున్నారు. అయితే రీసెంట్గా జరిగిన భగవంత్ కేసరి ఈవెంట్లో బాలయ్య మాట్లాడుతూ నేను యంగ్ హీరోగా ఇప్పుడే సినిమాలోకి అడుగుపెడదాం అనుకుంటున్నాను. నువ్వు అంత చిన్న పిల్ల అయిన శ్రీ లీల తో సినిమాలు చేస్తున్నావేంటి అని తిరిగి నన్నే అడిగాడు అని బాలయ్య చెప్పాడు. అయితే మోక్షజ్ఞ తొలిచిత్రంలో శ్రీ లీలే కథానాయకగా చేస్తుంది అనే పుకార్లు వినిపిస్తున్నాయి.

మరి ఈ దసరా కైనా అనౌన్స్మెంట్ వస్తుందేమో అని నందమూరి ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పటికైనా వాళ్ళ ఆశలు పండుతున్నాయేమో, ఈసారైనా మోక్షజ్ఞ మోసం చేయడు కదా అని అనుకుంటున్నారు. మరి అనౌన్స్మెంట్ ఇంకా టైటిల్ రివిల్ ఈ దసరాకి వస్తే సినిమా వచ్చే సంవత్సరం విడుదల కావచ్చు. మోక్షజ్ఞ నటనలో మరో బాలయ్య అవుతాడో లేదో అనేది తెర పైన చూడాలి.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: జనసేన పార్టీ నేతలకు కీలక ఆదేశాలు ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ఆ నేతలు పాటిస్తారా?

Pawan Kalyan:  పవన్ కళ్యాణ్ లో ఇప్పుడు పరిపూర్ణ రాజకీయ నాయకుడు కనిపిస్తున్నాడు. పార్టీకి సంబంధించి అనేకమైన కీలక నిర్ణయాలను చాలా పరిణితితో తీసుకుంటున్నారు. పోలింగ్ రెండు వారాల్లో ఉంది కాబట్టి ఈ...
- Advertisement -
- Advertisement -