Naga Shourya: ఆ ఆరోగ్య సమస్యతో నాగశౌర్య బాధ పడుతున్నారా?

Naga Shourya: టాలీవుడ్ యువ హీరో నాగశౌర్య.. ఇటీవల ఓ సినిమా షూటింగ్ సమయంలో కొంత అస్వస్థతకు గురి అయ్యాడు. ఒక్కసారిగా కళ్ళు తిరిగి క్రింద పది పోవడంతో షూటింగ్ యూనిట్ మొత్తం అయోమయానికి గురయ్యారు. ఇక వెంటనే హీరోని హాస్పిటల్ కి తీసుకువెళ్లారు. అయితే ఇటీవల పెళ్లి వార్తలను ధృవీకరించిన నాగశౌర్య.. మరి కొన్నిరోజుల్లో పెళ్లి పీటలు ఎక్కనున్నాడు. ఇక ఇలాంటి సమయంలో ఇలా నాగశౌర్య స్పృహ తప్పి పడిపోవడం అందర్నీ ఆందోళనకు గురి చేస్తుంది.

ఇక ఈ విషయం బయటికి రావడంతో అభిమానులు, ఐనవాళ్లు అందరు ఒకింత ఆందోళనకు లోనయ్యారు. ఏం జరిగిందోనని భయపడ్డారు. చిత్ర యూనిట్ కూడా ఆ సమయంలో ఏమి స్పందించక పోవడం కొంత ఆందోళనను పెంచింది. ఇక అభిమానులు అసలు నాగశౌర్య కు ఏమి జరిగిందో వెంటనే తెలుసుకోవాలని ప్రయత్నాలు చేసారు.

అసలు కారణం అదేనా?

నాగశౌర్యకు ఏమయ్యిందోనని అభిమానులు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో.. అసలు విషయం బయటికి వచ్చింది. దీనితో అందరు ఊపిరి పీల్చుకున్నారు. ఒక యాక్షన్ ఎపిసోడ్ చిత్రీకరణలో నాగశౌర్య పడిపోయాడని చిత్ర యూనిట్ క్లారిటీ ఇచింది. సిక్స్ ప్యాక్ ఎక్స్పోస్ చేయడం కోసం నాగశౌర్య మూడు రోజులుగా నీళ్లు త్రాగలేదట. దానివల్ల డీ హైడ్రేట్ అవ్వడంతో నాగశౌర్య కళ్ళు తిరిగి పడిపోయాడని క్లారిటీ ఇచ్చారు.

కేవలం డీహైడ్రేషన్ వల్ల నాగశౌర్య పడిపోయాడని తెలిసి అందరు ఊపిరి పీల్చుకున్నారు. వెంటనే ఆసుపత్రికి తరలించడంతో డాక్టర్లు అవసరమైన ఫ్లూయిడ్స్ నాగశౌర్యకు ఎక్కించారని.. ప్రస్తుతం హైదరాబాద్ లోని ఏఐజీ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న నాగశౌర్య ఆరోగ్యం నిలకడగా ఉందని తెలియడంతో అభిమానులు కూల్ అయ్యారు. ఇక త్వరలోనే నాగశౌర్య ఓ ఇంటివాడు కాబోతున్న విషయం తెలిసిందే..!

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -