Nagababu: ఈ ఏడాది ఎన్నికల్లో పవన్ తో పాటు నాగబాబు గెలవడం ఖాయమా?

Nagababu: మెగా ఫ్యామిలీకి రాజకీయాల్లో ఓ గుర్తింపు ఉంది. ప్రజారాజ్యం, జనసేన పార్టీలతో వారు గుర్తింపును తెచ్చుకున్నారు. రెండు పార్టీలను నడించిన చరిత్రకలిగిన మెగా ఫ్యామిలీ నుంచి గెలిచిన దాఖలాలు లేవు. ఒక్క చిరంజీవి రెండు స్థానాల్లో పోటీ చేసి ఒక స్థానంలోనే గెలిచారు. ఇక పవన్ రెండు సార్లు పోటీ చేసి ఓడిపోయారు. నర్సాపురం ఎంపీగా పోటీ చేసిన నాగబాబుకు కూడా చేదు అనుభవమే ఎదురైంది. రాజకీయ అనుభవం ఉన్నప్పటికీ ఓడిపోయిన చరిత్రే ఎక్కువ. కానీ, ఇప్పుడు పరిస్థితులు మారాయి. జనసేకు ఏపీ రాజకీయ పరిస్థితులు అనుకూలంగా ఉన్నారు. కాబట్టి ఈ పరిస్థితులను క్యాచ్ చేసుకోవాలని నాగాబాబు అనుకుంటున్నారు.

 

అందుకే ఆయన ఎంపీగా పోటీ చేసి పార్లమెంట్ కు వెళ్లాలని ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. గత ఎన్నికల తర్వాత పార్టీ కార్యకర్తగా మాత్రమే ఉంటా.. క్రియాశీలక రాజకీయాల్లో ఉండను అని నాగబాబు ప్రకటించారు. పార్టీ పదవులకు కూడా రాజీనామా చేశారు. కానీ, ఇప్పుడు టీడీపీ, జనసేన పొత్తు కుదిరింది కనుక.. గెలుపు అవకాశాలు ఉంటాయని నాగబాబు అంచనా వేస్తున్నారు. అందుకే అనకాపల్లి నుంచి ఎంపీగా పోటీ చేయాలని చూస్తున్నారని టాక్. పవన్ కల్యాణ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. అందుకే, నాగబాబు వైజాగ్ లో మకాం వేశారని చర్చ జరుగుతోంది. అయితే, పొత్తులో బాగంగా అనకాపల్లి జనసేనకు వస్తుందా? అన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న.

ఎందుకంటే.. టీడీపీలోనే అనకాపల్లి టికెట్ కోసం పెద్ద ఎత్తున పోటీ నడుస్తోంది. బైరి దిలీప్ చక్రవర్తి అనే నేతకు అనకాపల్లి స్థానాన్ని చంద్రబాబు కన్ఫామ్ చేసినట్టు తెలుస్తోంది. అటు, చింతకాయల విజయ్ కూడా గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు నాగబాబు కూడా పోటీలో ఉంటానంటే ఈ సమస్యను చంద్రబాబు, పవన్ ఎలా పరిష్కరిస్తారో చూడాలి. అయితే, నాగాబాబును అనకాపల్లి బరిలో దించాలనుకోవడానికి కూడా ఓ బలమైన కారణం ఉంది. ఇప్పటికే ఈ లోక్‌సభ నియోజవర్గం పరిధిలోని 2 అసెంబ్లీ స్థానాలకు జనసేన టికెట్లు కేటాయించింది మచిలీపట్నం టికెట్ బాలశౌరికి, కాకినాడ టికెట్ సాన సతీష్ కుమార్ కు కేటాయించారు పవన్. ఈ రెండు స్థానాల్లో జనసేన గెలుపు ఖాయంగా తెలుస్తోంది. ఇలా బలంగా ఉన్న స్థానంలోనే నాగబాబును ఎంపీ అభ్యర్థిగా దించితే గెలుపు సులవు అవుతోందని పవన్ వ్యూహాం. అంతేకాదు.. అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాస్త వ్యతిరేకత ఉంటే.. నాగబాబు ఫేస్ తో వాటిని సరి చేయొచ్చనేది మరో ఆలోచన. వ్యూహాలు బాగానే ఉన్నాయి కానీ.. పొత్తులో భాగంగా సీటు జనసేనకు వస్తుందా? లేదా? అన్నది చూడాలి. గత ఎన్నికల్లో నర్సాపురం నుంచి నాగాబాబు పోటీ చేశారు. కానీ, ఈసారి పొత్తులో భాగంగా నర్సాపురం స్థానం ఏ పార్టీకి దక్కినా.. అదే పార్టీ నుంచి రఘురామకృష్ణం రాజు పోటీ చేస్తారు. అక్కడ ఆయనకు గెలుపు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అందుకే, నాగబాబు అనకాపల్లి వైపు చూస్తున్నారని టాక్ నడుస్తోంది.

 

 

Related Articles

ట్రేండింగ్

Jagan- Pawan, Sharmila: ఆ జిల్లాలో ఒకేరోజు జగన్, షర్మిల, పవన్ కళ్యాణ్.. ప్రచారంతో మెప్పించేదెవరో?

Jagan- Pawan, Sharmila: ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు పెద్దగా సమయం లేకపోవడంతో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను మొదలు పెడుతున్నారు. ఈ క్రమంలోనే పార్టీ నాయకులు జనాలలోనే ఉంటూ పార్టీ ప్రచార కార్యక్రమాలను...
- Advertisement -
- Advertisement -