NTR: ఎన్టీఆర్ పరిస్థితి ఇంత ఘోరమా.. రూ.500 కూడా రాలేదా?

NTR: టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ హీరోలలో ఎంతో క్రేజ్ సొంతం చేసుకుని ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్నటువంటి వారిలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒకరు.బాలు నటుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఎన్టీఆర్ అనంతరం హీరోగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ సాధించారు ఇక తాజాగా రాజమౌళి దర్శకత్వంలో నటించిన RRR సినిమా ద్వారా ఈయన ఏకంగా గ్లోబల్ స్టార్ గా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఇండస్ట్రీలో ఎంతో మంచి క్రేజీ సొంతం చేసుకున్న ఎన్టీఆర్ కు గోర అవమానం జరిగిందని తెలుస్తుంది.

 

రెండు తెలుగు రాష్ట్రాలలో ఊర మాస్ క్రేజ్ ఉన్నటువంటి హీరోలలో ఎన్టీఆర్ ఒకరు ఈయన సినిమా విడుదలవుతుంది అంటే అభిమానులు చేసే హంగామా మామూలుగా ఉండదు. అయితే తాజాగా నటించిన ఆంధ్ర వాలా సినిమా రిలీజ్ అయిన సందర్భంగా అభిమానులు పెద్దగా ఈ సినిమాని ఆదరించకపోవడంతో ఎన్టీఆర్ కి ఘోర అవమానం జరిగింది అంటూ పలువురు భావిస్తున్నారు.

 

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇప్పటికే మహేష్ బాబు పవన్ కళ్యాణ్ బాలకృష్ణ వంటి హీరోలు నటించిన బ్లాక్ బస్టర్ సినిమాలు విడుదలయ్యాయి అయితే తాజాగా రాంచరణ్ నటించిన డిజాస్టర్ సినిమా ఆరెంజ్ విడుదల అద్భుతమైన కలెక్షన్లను సాధించి అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ నటించిన ఆంధ్ర వాలా సినిమా గత కొద్దిరోజుల క్రితం విడుదలైంది.

 

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో డిజాస్టర్ గా నిలిచింది అయితే ఇప్పుడైనా ప్రేక్షకుల ఆదరణ అందుకుంటుందని భావించిన వారికి నిరాశ మాత్రమే ఎదురైంది. కనీసం ఎన్టీఆర్ అభిమానులు ఈ సినిమా వైపు చూడను కూడా లేదు.అభిమాన హీరో సినిమా రిలీజ్ అయితే కనీసం అభిమానుల నుంచి ఏ విధమైనటువంటి స్పందన లేకపోవడం ఎన్టీఆర్ కు ఘోర అవమానం అని పలువురు భావిస్తున్నారు.

 

ఇక ఈ సినిమా కలెక్షన్లకు సంబంధించిన ఒక పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇందులో భాగంగా సీడెడ్‌లో రూ. 480, ఆంధ్రాలో రూ. 460, నైజాంలో రూ. 60 అంటూ ఓ పోస్టర్ సోషల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుంది. దీనికి ఎన్టీఆర్ ఫ్యాన్స్ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఇది నిజమేనని భావిస్తున్నారు.ఏది ఏమైనా ఎన్టీఆర్ సినిమా తిరిగి రిలీజ్ అవుతే కనీసం 500 రూపాయలు కూడా కలెక్షన్లను సాంపాదించలేకపోవడం నిజంగానే దారుణం అంటూ పలువురు ఈ పోస్టర్ స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -