Harish Shankar: హరీష్ శంకర్ మూవీ విషయంలో పవన్ కళ్యాణ్ అలా చేస్తున్నారా?

Harish Shankar: తెలుగు సినీ ప్రేక్షకులకు డైరెక్టర్ హరిష్ శంకర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. హరీష్ శంకర్ ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల మే నాలుగవ తేదీ హరీష్ శంకర్ మనల్ని ఎవడ్రా ఆపేది.. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రెండో షెడ్యూలుకు రెడీ అవుతున్నాం అంటూ ఈ ట్వీట్ చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ ఒక వారం రోజులు డేట్స్ ఇచ్చి ఒక పని అయిపోయింది అని అనుకున్నారు.

మళ్లీ జూన్ లో రెండో షెడ్యూల్ అని అనుకున్నారు. కానీ సడన్గా మే 15 కు కాస్త అటు ఇటుగా డేట్లు ఇస్తానని కబురు రావడంతో దర్శకుడు హుషారుగా అలాంటి ట్వీట్ చేశారు. ఫుల్ ఎనర్జిటిక్ గా వుండే హరీష్ రెండో షెడ్యూలుకు రెడీ, మనల్ని ఎవడ్రా ఆపేది అంటూ ఓ ట్వీట్ వేసారు. అయితే హరి శంకర్ సంతోషంగా అయితే ట్విట్ చేశారు కానీ నేడు 18 వ తేదీ వస్తోంది. కానీ రెండో షెడ్యూలు జాడ లేదు. అసలు ఆ విషయం గురించి ఎటువంటి అప్డేట్ కూడా లేదు. మరోపక్కన బ్రో సినిమాలో ఐటమ్ సాంగ్ కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. 22 తరువాత ఏ రోజైనా పవన్ ఆ షూట్ లో జాయిన్ కావచ్చని వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.

 

అలాగే హరి హర వీరమల్లు కు సంబంధించి పాట కూడా పూర్తి చేసే ఆలోచనలో వున్నారు పవర్ స్టార్ అని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మొత్తంగా ప్రస్తుతం పరిస్థితులను బట్టి చూస్తుంటే పవన్ కళ్యాణ్ ముందుగా అనుకున్న విధంగానే జూన్ లోనే రెండో షెడ్యూల్ ని మొదలు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు పవన్ కళ్యాణ్ రాజకీయ రంగా కాస్త గందరగోళం నెలకొన్న విషయం తెలిసిందే. తాను సీఎం అయ్యే అవకాశాలు లేవు అని పవన్ కళ్యాణ్ స్వయంగా ప్రకటించడం, వచ్చే ఎన్నికలలో టిడిపి పొత్తు పెట్టుకుంటా అని చెప్పడంతో జనసేన నాయకులు తీవ్ర నిరాశ చెందుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -