Dookudu: దూకుడు మూవీ సక్సెస్ సాధించడానికి పవన్ కళ్యాణ్ కారణమా.. నమ్మకపోయినా నిజమిదేనా?

Dookudu: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టాలెంట్ మన అందరికీ తెలిసిందే. ఆయన రాజకీయాల వైపు దృష్టి పెట్టకపోయి ఉంటే ఈపాటికి ఇండస్ట్రీకి ఎన్నో బంపర్ హిట్లు ఇచ్చి ఉండేవారు. అయినా ఇప్పటికే చాలా హిట్లు ఇచ్చిన పవన్ కళ్యాణ్ ఒక్క హీరో గానే కాదు ఆయనకి అనేక విభాగాల్లో నైపుణ్యత ఉంది. ఆయనలో ఒక కొరియోగ్రాఫర్, ఒక డైరెక్టర్ ఇలా చాలా కోణాలు ఉన్నాయి. తమ్ముడు సినిమాకి చాలా వరకు పవన్ కళ్యాణే డైరెక్షన్ చేశారు.

అలాగే ఖుషి సినిమాలో కూడా డైరెక్షన్ విషయంలో చాలా వరకు పవన్ కళ్యాణ్ ఇన్వాల్వ్ అయినట్లు ఆ సినిమా డైరెక్టర్ అయిన ఎస్ జె సూర్య పబ్లిక్ గానే చెప్పటం విశేషం. అయితే జానీ అనే సినిమాని డైరెక్ట్ చేసిన పవన్ కళ్యాణ్ ఆ సినిమా పెద్ద డిజాస్టర్ అవటంతో మళ్ళీ డైరెక్షన్ వైపు తిరిగి చూడలేదు. గుడుంబా శంకర్ సినిమాలో కొన్ని పాటలకి ఆయనే కొరియోగ్రఫీ చేశారు.

అయితే ఆ సినిమా కూడా అనుకోని కారణాల వలన పెద్ద డిజార్డర్ అయింది. అయితే పవన్ కళ్యాణ్ సినిమాలను ఇన్స్పిరేషన్ గా తీసుకొని చాలామంది హిట్లు కొట్టారు. ఆ సినిమాలు మాత్రం బాగా హిట్ అయ్యాయి. అందులో ఒకటి మహేష్ బాబు హీరోగా నటించిన దూకుడు. నిజమేనండి దూకుడు సినిమా పవన్ కళ్యాణ్ తీసిన సినిమాలతో ఇన్స్పైర్ అయ్యి చేసిన సినిమా అని ఆదర్శకుడు శ్రీనువైట్ల బహిరంగంగానే చెప్పుకొచ్చాడు.

అసలు నిజానికి దూకుడు సినిమా శ్రీను వైట్ల పవన్ కళ్యాణ్ తోనే చేయవలసింది. కానీ ఎందుకో ఆ కాంబినేషన్ కుదరలేదు. శ్రీను వైట్ల కూడా పవన్ కళ్యాణ్ ఇన్స్పిరేషన్ గా తాను చాలా సినిమాలు చేశానని, కానీ ఆయనతో సినిమా చేసే అవకాశం ఇప్పటివరకు దక్కలేదని, అవకాశం వస్తే ఎట్టి పరిస్థితులలోనూ వదులుకోనని చెప్తున్నాడు శ్రీనువైట్ల. మరి అతని కోరిక తీరుతుందో లేదో వేచి చూడాల్సిందే.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -