Pawan Kalyan: పవన్ రాజకీయాల విషయంలో సరిదిద్దుకోలేని తప్పు చేస్తున్నారా?

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలన్నీ 2024 ఎన్నికల గురించే నడుస్తున్నాయి. 2019 ఎన్నికల్లో ప్రభజనం సృష్టించిన వైఎస్ఆర్సీపీ మరోసారి విజయఢంగా మోగించాలని కసరత్తులు చేస్తోంది. ఈ సారి మనం గెలువకపోతే పార్టీ తుడిచిపెట్టుకపోవటం కాయమనే భావన తెలుగుదేశం పార్టీలో ఉంది. ఇదే క్రమంలోనే పవన్ పక్కాగా ఈ సారి సీఎం కావాలని జనసైనికులు భావిస్తున్నారు. ఈ తరణంలో పొత్తులపై పవన్ కళ్యాణ్ పేల్చిన బాంబ్ కి ఆ పార్టీ సైనికులు విలవిలలాడిపోతున్నారు.

అకాల వర్షాలకు నష్టపోయిన రైతులను పరామర్శించేందుకు ఏపీలో పర్యటించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించిన సందర్భంగా ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ప్రభుత్వం రైతుల్ని అస్సలు పట్టించుకోవటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనతో కలిసి రైతులపై కేసులు పెట్టి హింసిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.

 

రాజమండ్రి పర్యటన అనంతరం మంగళగిరిలోని పార్టీ కార్యాలయానికి వచ్చి పవన్ ప్రెస్ మీట్ పెట్టారు. ఆ సందర్భంలో పొత్తుపై కీలక వ్యాఖ్యలు చేశారు. తనకి ఓటు వేయని వారు, తనని సీఎం కావాలని కోరుకోవటం సబబు కాదని పవన్ ఘాటుగా కౌంటర్ వేశారు. అంతేకాకుండా కనీసం మనకు ఎన్ని సీట్లు ఉన్నాయనే సోయ ఉండాలని అన్నారు. గత ఎన్నికల్లో 137 సీట్లలో పోటీ చేస్తే, కనీసం 30 నుంచి 40 సీట్లు గెలవలేదన్నారు.

 

ఇదే క్రమంలో పక్కాగా పొత్తులు ఉంటాయని పవన్ స్పష్టం చేశారు. టీడీపీతో పొత్తు ఉంటుందని ఇందుకు అంగీకరించే వారు తనతో ఉండవచ్చన్నారు. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ తన లక్ష్యమన్నారు. పొత్తులతో జనసేన పార్టీ బలంగా తయారు అవుతోందన్నారు. అయితే పవన్ ఫ్యాన్సు, జనసైనికులు మాత్రం ఈ నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయాల విషయంలో తప్పు చేస్తున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి. చంద్రబాబు చెప్పినట్టు నడిస్తే పవన్ ఎప్పటికీ సీఎం కాలేరని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

YCP-TDP: చంద్రబాబు అరెస్ట్ తో రగిలిపోతున్న టీడీపీ.. అరెస్ట్ పై వైసీపీ రియాక్షన్ ఏంటంటే?

YCP-TDP:  చంద్రబాబు నాయుడుని ఆధారాలు లేని కేసులో అరెస్టు చేసి జైల్లో పెట్టిన జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం ఏం చేస్తున్నాడు అంటే చంద్రబాబు నాయుడుని జైల్లో పెట్టిన సందర్భంగా పండగ చేసుకుంటూ బాగా...
- Advertisement -
- Advertisement -