Prabhas: ప్రభాస్ శ్రీలీల జోడీ.. ఈమె జాతకాన్ని మార్చడం ఆయనకు సాధ్యమేనా?

Prabhas: మామూలుగా సినిమా ఇండస్ట్రీకు, సెలబ్రిటీలకు సంబంధించి అనేక రకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. అందులో కొన్ని నిజమైతే మరికొన్ని గాసిప్స్. ముఖ్యంగా అందులో కొన్ని రకాల వార్తలు సెలబ్రిటీలకు అలాగే వారి అభిమానులకు కోపం తెప్పించేవిగా కూడా ఉంటాయి. అటువంటి వాటిలో కొద్దిరోజుల క్రితం హను రాఘవపూడి దర్శకత్వంలోప్రభాస్ ఒక సినిమాకు సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వినిపించాయి. కొద్దిరోజుల పాటు ఈ వార్తను సోషల్ మీడియాలో వైరల్ కాగా దానిపై ప్రభాస్ ఫ్యాన్స్ తీవ్ర విముఖత వ్యక్తం చేశారు.

సీతారామం లాంటి సినిమాతో హిట్ కొట్టినప్పటికీ, మాస్ అపీల్ కు దూరంగా సినిమాలు తీసే హను రాఘవపూడితో మాస్ హీరో ప్రభాస్ సినిమా అంటే ఇష్టపడలేదు చాలామంది. అయితే అదే వద్దనుకుంటే, ఇప్పుడు ఫ్యాన్స్ కు మరింత కోపం తెప్పించేలా మరో మేటర్ బయటకు వచ్చింది. ఈ ప్రాజెక్టులో శ్రీలీలను హీరోయిన్ గా తీసుకుంటున్నారనేది తాజా టాక్. ఈ వార్త వినగానే మొదట శ్రీ లీల అభిమానులు అలాగే ప్రభాస్ అభిమానులు షాక్ అవుతున్నారు. ప్రభాస్ తో సినిమా కోసం సైలెంట్ గా వర్క్ స్టార్ట్ చేసిన హను రాఘవపూడి, హీరోయిన్ రోల్ కోసం శ్రీలీలను సంప్రదించాడంట.

 

దీంతో ఫ్యాన్స్ మరోసారి భగ్గుమంటున్నారు. ఆ దర్శకుడే వద్దనుకుంటుంటే, ఇప్పుడు హీరోయిన్ కూడానా అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. శ్రీ లీలాకు ప్రభాస్ కు అసలు ఏమైనా సెట్ అవుతుందా అంటూ కొందరు మండిపడుతున్నారు.శ్రీలీల కెరీర్ ప్రస్తుతం ఏమంత ఆశాజనకంగా కనిపించడం లేదు. గుంటూరు కారం లాంటి పెద్ద సినిమా ఆమెకు హెల్ప్ కాలేదు సరికదా, నెగెటివ్ సెంటిమెంట్ ను కూడా ఎగదోసింది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని శ్రీలీలను వద్దంటున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. అయితే ప్రభాస్ ఇలాంటివి పట్టించుకోడనే సంగతి తెలిసిందే. గతంలో మారుతితో సినిమా చేయొద్దంటూ డిమాండ్ చేశారు ఫ్యాన్స్. కానీ అదే మారుతి దర్శకత్వంలో రాజా సాబ్ సినిమా చేస్తున్నాడు. ఇప్పుడు హను రాఘవపూడికి అవకాశం ఇచ్చాడు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -