Pawan Kalyan: ఆ బ్యానర్ పై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోపంగా ఉన్నారా?

Pawan Kalyan: తాజాగా మైత్రి మూవీస్ సంస్థలో రాజకీయ నాయకుడు బాలినేని శ్రీనివాస్ రెడ్డి బంధువు అయినా భాస్కర్ రెడ్డి లపై వైజాగ్ జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ ఇన్కమ్ టాక్స్ అధికారులకు ఫిర్యాదు చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. బాలినేని,ఆయన బంధువుల పెట్టుబడులు సినిమా నిర్మాణ సంస్థ అయిన మైత్రీ మూవీ మేకర్స్ లో ఉన్నాయన్నది మూర్తి యాదవ్ ఆరోపణ. ఈ మేరకు దర్యాప్తు చేయాలని ఇన్ కమ్ టాక్స్ అధికారులను కోరారు మూర్తి యాదవ్. అయితే మైత్రి మూవీస్ లో పెట్టుబడులు పెట్టాడా లేదా అన సంగతి పక్కన పెడితే.

అలా పెట్టడం అన్నది నేరం ఏమీ కాదని చెప్పవచ్చు. డబ్బు వున్నవాళ్లు ఎవరైనా మైత్రీ మూవీస్ కు అవసరం వుంటే, అంగీకారం వుంటే పెట్టుకోవచ్చు. తప్పేంటీ? కానీ అది కంపెనీ రికార్డుల్లో వుండాలి. తెరచాటు వ్యవహారం అయితే, పొలిటికల్ డబ్బు కనుక అభ్యంతరమే. కానీ నిజానికి సినిమా నిర్మాణాల్లో చాలా మంది పెట్టుబడులు పెట్టడం చేస్తుంటారు. అయితే ఇది పెట్టుబడుల రూపంలో వుండదు. ఫైనాన్స్ రూపంలో వుంటుంది. రూపాయి నుంచి రెండు రూపాయల వడ్డీలకు ఇస్తారు. ఇదంతా పక్కన పెడితే మూర్తి యాదవ్ ఫిర్యాదు చేస్తున్న చేయబోతున్న సంగతి పవన్ కళ్యాణ్ కు తెలుసా తెలియదా అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.

ఎందుకంటే మూర్తి యాదవ్ జనసేన కార్పొరేటర్ అన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం పవన్ అదే మైత్రి మూవీ మూవీస్ లో సినిమాను చేస్తున్నారు. ఆ విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. మరి పవన్ కళ్యాణ్ కి నిజం చెప్పే ఆ విధంగా ఫిర్యాదు చేశారా? ఒకవేళ పవన్ కళ్యాణ్ కు చెప్పి ఫిర్యాదు చేసి ఉంటే పవన్ రియాక్షన్ ఏమిటి అందుకు అనుమతిని అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పవన్ కళ్యాణ్ కు తెలిసి ఇదంతా జరుగుతూ ఉంటే దీని వెనుక పవన్ కళ్యాణ్ ఉద్దేశం ఏమిటి అన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. మొత్తానికి ఈ విషయంపై ఏపీలో పెద్ద ఎత్తున చర్చలు కొనసాగుతున్నాయి. అంతేకాకుండా మూర్తి యాదవ్ చేసిన ఫిర్యాదు పవన్ కళ్యాణ్ మెడకు చుట్టుకున్నట్టు అయింది..

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -