Rammohan Naidu: అలా జరిగితే.. కేంద్ర మంత్రిగా రామ్మోహన్ నాయుడు?

Rammohan Naidu: కింజరపు రామ్మోహన్ నాయుడు గురించి ఏపీ రాజకీయాల్లో తెలియని వారు ఉండరు. దివంగత మాజీ కేంద్రమంత్రి ఎర్రనాయుడి కుమారుడిగా, శ్రీకాకుళం ఎంపీగా రామ్మోహన్ నాయుడు అందరికీ తెలిసిన యువ రాజకీయ నాయుడు. డైనమిక్ లీడర్ గా ఏపీ పాలిటిక్స్ లో పేరు తెచ్చుకున్నాడు. టీడీపీలో తన కంటూ ప్రత్యేకమైన స్థానాన్ని దక్కించుకున్నాడు. టీడీపీ అధినేత చంద్రబాబు దగ్గర కూడా రామ్మోహన్ నాయుడికి మంచి పేరు ఉంది. ఇక టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తో కూడా రామ్మోహన్ నాయుడు అత్యంత సన్నిహితంగా మెలుగుతాడు. దీంతో టీడీపీలో అందరూ రామ్మోహన్ నాయుడిని అభిమానిస్తారు.

ఇక రామ్మోహన్ నాయుడు మంచి వాగ్దాటి అని ఆనన పార్లమెంట్ సమావేశాల ప్రసంగాలను చూస్తే తెలుస్తుంది. ఏపీ సమస్యలపై పార్లమెంట్ తో గట్టిగా మాట్లాడతారు. రాజకీయ విమర్శలను పక్కన పెట్టి సమస్యలపై పార్లమెంట్ లో గట్టిగా ప్రశ్నిస్తారు. విమర్శలు వదిలేసి సబ్జెట్ మాత్రమే మాట్లాడతారు. హిందీ, ఇంగ్లీష్ భాషల్లో రామ్మోహన్ నాయుడికి మంచి ప్రావీణ్యం ఉంది. దీంతో ఏ భాషలోనైనా అనర్గళంగా పార్లమెంట్ లో ప్రసంగిచగలరు. గంటసేపు అయినా సరే సమస్యలపై మాట్లాడగలరు. అందుకే యువ ఎంపీ అయిన రామ్మోహన్ నాయుడి స్పీచ్ కు పార్లమెంట్ లో మిగతా ఎంపీలు కూడా ఆకర్షితులు అవుతారు. రామ్మోహన్ నాయుడు తన స్పీచ్ తో పార్లమెంట్ లో ప్రధాని మోదీ కూడా ఆకట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి.

ఎర్రనాయుడికి అప్పట్లో ఢిల్లీలో ఎంత పలుకుబడి ఉండేదో అందరికీ తెలిసిందే. ఢిల్లీలోని జాతీయ నేతలందరికీ ఆయనతో సంబంధాలు ఉండేవి. చంద్రబాబు ఇక్కడ రాష్ట్రంలో ఉంటే.. ఎర్రనాయుడి ఎంపీగా ఉంటూ ఢిల్లీలో వ్యవహారాలు చక్కపెట్టేవారు. అందుకే అన్ని పార్టీల నేతలతో ఆయనకు పరిచయాలు ఉండేవి. పలుమార్లు ఎంపీగా, కేంద్ర మంత్రిగా ఎర్రనాయుడి పనిచేశారు. ఆయన కుమారుడిగా రామ్మోహన్ నాయుడి కూడా గుర్తింపు సంపాదించుకున్నారు. పార్లమెంట్ లో రాష్ట్ర సమస్యలపై మాట్లాడుతూ తండ్కిక తగ్గ తనయుడిగా పేరు దక్కించుకున్నాడు.

దీంతో భవిష్యత్ లో రామ్మోహన్ నాయుడిక కేంద్రమంత్రి అవకాశాలు మెండుగా ఉన్నాయని తెలుగు తమ్ముళ్లలో చర్చ జరుగుతుంది. శ్రీకాకుళం ఎంపీగా టీడీపీ తరపున రామ్మోహన్ నాయుడు రెండుసార్లు గెలుపొందారు. యువ లీడర్ గా టీడీపీలో ఉన్నారు. ఒకవేళ ఎన్డీయేలో టీడీపీ చేరితే రామ్మోహన్ నాయుడికి కేంద్ర మంత్రి పదవి దక్కే అవకాశాలున్నాయనే చర్చ జరుగుతోంది. ఎన్డీయేలో చేరితే టీడీపీ కేంద్రమంత్రి పదవులు అడిగే అవకాశముంది. అదే జరిగితే ప్రస్తుతం లోక్ సభలో టీడీపీపక్ష నేతగా ఉన్న రామ్మోహన్ నాయుడికే ఎక్కువ అవకాశాలు ఉంటాయని అంటున్నారు.

టీడీపీలో యువకులకు పెద్దపీట వేయాలని చంద్రబాబు చూస్తున్నారు. పార్టీలో, పదవుల్లో యువతకు ప్రాధాన్యం ఇవ్వాలని చూస్తున్నారు. అలాగే టీడీపీ అంటేనే బీసీల పార్టీగా ఏపీ రాజకీయాల్లో ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. అందుకే ఎన్టీయేలో చేరితే బీసీ సామాజికవర్గానికి చెందిన రామ్మోహన్ నాయుడిని కేంద్రమంత్రిగా చంద్రబాబు సిఫార్సు చేసే అవకాశముంది. బీసీల ఓట్లను తమ వైపు తిప్పుకునేందుకు వైసీపీ ప్రయత్నాలు చేస్తోంది. ఆర్.కృష్ణయ్యకు రాజ్యసభ ఎంపీ పదవిని కేటాయించారు. అందుకే రామ్మోహన్ నాయుడితో వైసీపీకి చెక్ పెట్టాలని చూస్తున్నారు.

నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ ఎన్టీయే నుంచి బయటికి వెళ్లింది. శివసేన లాంటి పెద్ద పార్టీలన్నీ ఎన్డీయే నుంచి బయటికి వచ్చాయి. దీంతో టీడీపీని ఎన్డీయేలో చేర్చుకోవాలని బీజేపీ భావిస్తోంది. అదే జరిగితే రామ్మోహన్ నాయుడికి కేంద్రంలో కీలక పదవులు దక్కే అవకాశముంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -