Sharmila: వైసీపీ బీజేపీని షర్మిల కలిపి తిట్టడం వెనుక సలు లెక్కలివేనా?

Sharmila: వైఎస్ షర్మిల ఏపీలో ఎంటర్ అవ్వడమే తడువు.. దూకుడు ప్రదర్శిస్తున్నారు. సహజంగానే దూకుడు స్వభావం ఉన్న షర్మిల.. వెనక కాంగ్రెస్ కూడా ఉండటంతో మరింత పదునైన విమర్శలు చేస్తున్నారు. పీసీసీ పగ్గాలు చేపట్టిన వెంటనే ఇచ్చాపురం నుంచి యాత్రను ప్రారంభించారు. ఓ రకంగా చెప్పాలంటే.. చంద్రబాబు, జగన్, పవన్ కంటే ఎక్కువ దూకుడుగా కనిపిస్తున్నారు. కానీ, ఈ దుందుడుకు తనం ఆమె అనుకున్న టార్గెట్ ను రివర్స్ చేస్తుందేమో అన్న అనుమానాలు కలిగిస్తున్నాయి. జగన్ ఓటమే లక్ష్యంగా ఆమె ఏపీ రాజకీయాల్లోకి ప్రవేశించారు. అందుకే ఎక్కువ విమర్శలు జగన్ పైనే చేస్తున్నారు. ఏపీలో అభివృద్ధి శూన్యమని విమర్శిస్తున్నారు. ఎక్కడైనా అభివృద్ధి ఉంటే చూపించాలని డిమాండ్ చేస్తున్నారు. అభివృద్ధిపై చర్చించడానికి అధికార పార్టీ నేతల సిద్దమా అని సవాల్ విసురుతున్నారు. ఇంత వరకూ బాగానే ఉన్నా.. అభివృద్ధిపై చర్చకు ప్రతిపక్షనేతలను కూడా పిలుస్తా.. అందరం కలసి చర్చింద్దామని అంటున్నారు. ఇక్కడే ఆమే వ్యూహాత్మక తప్పిదం చేస్తున్నారని సీనియర్ రాజకీయ నాయకులు చెబుతున్నారు. షర్మిల వెనక చంద్రబాబు ఉన్నారని జగన్ ప్రధానంగా ఆరోపిస్తున్నారు. ఇప్పుడు అభివృద్ధిపై చర్చకు ప్రతిపక్ష నేతలను తీసుకొని వస్తానని షర్మిల చెబుతుంటే.. జగన్ ఆరోపణలు నిజం అనే అభిప్రాయాలు జనంలోకి వెళ్తాయని కాంగ్రెస్‌లోనే వినిపిస్తున్నాయి.

ఇక జగన్ తర్వాత షర్మిల బీజేపీపై టార్గెట్ చేస్తున్నారు. ప్రత్యేకహోదా ఇవ్వకుండా బీజేపీ మోసం చేసిందని విమర్శిస్తున్నారు. రాహుల్ గాంధీని ప్రసన్నం చేసుకోవడానికే బీజేపీని టార్గెట్ చేస్తున్నారని చర్చ జరుగుతోంది. కానీ, ఇది మొదటికే మోసం చేస్తోందని అనుకుంటున్నారు. అసలు ఏపీలో పెద్దగా ప్రభావం చూపని బీజేపీని టార్గెట్ చేయడం వలన ఉపయోగం లేదని అంటున్నారు. గత ఎన్నికల ముందు కూడా చంద్రబాబు ఇదే తప్పు చేసి ఘోరంగా ఓడిపోయారని కాంగ్రెస్ నేతలు గుర్తు చేస్తున్నారు. బీజేపీకి ఒక్కస్థానం కూడా గెలిచే అవకాశం లేదు. కానీ, 1 నుంచి 2 శాతం వరకు ఓట్లు రావొచ్చు. పైగా అయోధ్య ఘటన తర్వాత హిందువుల్లో కొంతమంది మోడీని ఆరాధించడం మొదలు పెడుతున్నారు. అలా అని ఇప్పటికిప్పుడే బీజేపీ బలపడిందని కాదు. కానీ, గతంలో కంటే కాస్త ఓటింగ్ పెరిగింది. దీంతో బీజేపీ ప్రయోజనం లేదని భావిస్తున్న ఓటర్లు.. షర్మిల, కాంగ్రెస్ పై కోపంతో జగన్ వైపు తిరుగుతారనిన విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఎన్నికలు దగ్గర పడే కొద్ది ఈ పరిస్థితులు వైసీపీకి మరింత అనుకూలంగా మారుతాయని అనిపిస్తోంది. ఇదే జరిగితే.. షర్మిల చేస్తున్న అతి జగన్ నెత్తిన పాలు పోసినట్టు అవుతుందని కాంగ్రెస్‌లో ఓ వర్గం చెబుతోంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -