ఆ ఇంటర్వ్యూ తర్వాత సైలెంట్ అయిపోయిన సమంత.. కారణం?

టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన సమంత ఎప్పుడైతే నాగచైతన్య నుండి విడిపోయిందో అప్పటినుండి తన గురించి ఏ వార్త వచ్చిన అది వెంటనే హాట్ టాపిక్ గా మారుతుంది. తెలుగు ప్రేక్షకులకు ఏం మాయ చేసావే సినిమాతో పరిచయమైన ఈ ముద్దుగుమ్మ అప్పటి నుండి ఇప్పటివరకు వెను తిరగకుండా ఓ రేంజ్ లో దూసుకెళ్లింది. ఇక ఇప్పటికీ కూడా బాగానే అవకాశాలు అందుకుంటుంది.

ఇక ఈమెకు తెలుగు ఇండస్ట్రీలో ఒకప్పుడు మంచి అభిమానం ఉండేది. కానీ ఇప్పుడు ఆ అభిమానం కూడా బాగా తగ్గిపోయింది. కారణం.. ఆమె మంచి కుటుంబాన్ని కోల్పోవడం. అదేనండోయ్.. అక్కినేని నాగచైతన్యను ప్రేమించి అక్కినేని వారి కోడలిగా అడుగుపెట్టి అందరి బాగా ఆకట్టుకుంది. ఆ కుటుంబంతో ఉన్నంతకాలం సమంతకు మంచి గౌరవం ఉండేది.

కానీ పెళ్లైన నాలుగు సంవత్సరాలలోపు నాగచైతన్యను విడిపోయి అందరికి షాక్ ఇచ్చింది. చాలామంది తన తప్పు వల్లే ఇలా జరిగింది అని అన్నారు. కానీ ఆ మాటలు అన్ని పట్టించుకోకుండా వరుస ప్రాజెక్టులతో నచ్చినట్లుగా సైన్ చేసుకుంటూ వెళ్తుంది. విడాకుల తర్వాత సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా కనిపించిన సంగతి తెలిసిందే.

కానీ ఈ మధ్య సమంతలో అంత యాక్టివిటీ కనిపించడం లేదు.. ఏం జరిగిందో అని అందరూ అనుకుంటున్నారు. పైగా ఆ మధ్య నాగచైతన్య ఓ ఇంటర్వ్యూలో సమంత గురించి చేసిన వ్యాఖ్యల పట్ల తాను డిప్రెషన్ లోకి పోయిందేమో అని అనుమానాలు వస్తున్నాయి. అంతేకాకుండా సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉండటం లేదని అప్పటిలాగా వరుస పోస్టులు కూడా చేయడం లేదు అని అంటున్నారు కొందరు.

మరి కొంతమంది సమంత కొత్త సినిమాలపై ఫోకస్ పెట్టిందని దానివల్లే తనలో యాక్టివిటీ తగ్గిందని అంటున్నారు. మొత్తానికి తను డిప్రెషన్ లోకి వెళ్లడానికి రకరకాల కామెంట్లు మాత్రం వినిపిస్తున్నాయి. ఇక ప్రస్తుతం ఆమె నటించిన యశోద, శాకుంతలం సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అంతేకాకుండా ఓ హిందీ వెబ్ సిరీస్ నిర్మాణంలో ఉందని తెలుస్తుంది. విజయ్ దేవరకొండతో కలసి నటిస్తున్న ఖుషి నెక్ట్స్ షెడ్యూల్ త్వరలో ప్రారంభం కానుంది.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: జగన్ పై రాళ్ల దాడిలో పవన్ డిమాండ్లు ఇవే.. వైసీపీ దగ్గర జవాబులు ఉన్నాయా?

Pawan Kalyan: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై జరిగిన రాయితో దాడి గురించి ఇప్పటికే పెద్ద దుమారం చెలరేగుతుంది. అధికార ప్రభుత్వమే ఇలా చేయించింది అని ప్రత్యర్థులు అంటే ఇదంతా...
- Advertisement -
- Advertisement -