Samantha: సమంతకు రెండో పెళ్లి ఫిక్స్ అయిందా.. ఏం జరిగిందంటే?

Samantha: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి హీరోయిన్స్ లో నటి సమంత ఒకరు.ఇలా ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సమంత ప్రస్తుతం సినిమాలతో పాటు వెబ్ సిరీస్లలో కూడా నటిస్తూ దూసుకుపోతున్నారు. ఇకపోతే సమంత వ్యక్తిగత విషయానికి వస్తే ఈమె మొదట నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.మూడు సంవత్సరాల పాటు తన వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా గడిపిన సమంత అనంతరం నాగచైతన్యత వచ్చిన మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకొని విడిపోయారు.

ఇలా సమంత విడాకులు తీసుకోవడంతో ఈమె గురించి ఎన్నో రకాల వార్తలు సోషల్ మీడియాలో వినిపించాయి. ఇక సమంత రెండో పెళ్లి కూడా చేసుకోబోతుందంటూ తరచూ తన గురించి ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది. అయితే తాజాగా సమంత రెండో పెళ్లి చేసుకోవడానికి చాలా ఆసక్తి కనబరిస్తోందంటూ పరోక్షంగా ఈ విషయాన్ని తెలియజేస్తున్నారని సోషల్ మీడియా వేదికగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

ఇలా సమంత గురించి ఇలాంటి వార్తలు రావడానికి గల కారణం ఏంటి అనే విషయానికి వస్తే ఈమె తాజాగా నటిస్తున్న ఖుషి సినిమాని అందుకు కారణమని చెప్పాలి. విజయ్ దేవరకొండ హీరోగా సమంత హీరోయిన్ గా శివ నిర్వాణ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులు జరుపుకుంటుంది. అయితే తాజాగా సమంత పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి సరికొత్త పోస్టర్ విడుదల చేసిన విషయం మనకు తెలిసిందే.

ఇందులో సమంత చాలా హోమ్లీగా డ్రెస్ వేసుకోవడమే కాకుండా మెడలో ఐడి కార్డుతో పాటు నల్లపూసల దండ వేసుకున్నారు. ఇలా ఈమె నల్ల పూసల దండ వేసుకోవడంతో రెండో పెళ్లి పై ఆసక్తి ఉండడంతోనే ఇలా పెళ్లి అయినటువంటి పాత్రలలో నటిస్తున్నారంటూ పలువురు కామెంట్లు వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో విజయ్ దేవరకొండకు సమంతకు పెళ్లి అయి ఉంటుందని ఈ పోస్టర్ చూస్తేనే అర్థమవుతుంది. మరి ఈ సినిమా సమంతకు ఎలాంటి సక్సెస్ అందిస్తుందో తెలియాల్సి ఉంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -