Sharwanand: మాజీ మంత్రి మనవరాలిని శర్వానంద్ పెళ్లి చేసుకోబోతున్నాడా?

Sharwanand: తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన యంగ్, ట్యాలెంటెడ్ హీరోల జాబితాలో శర్వానంద్ కూడా ఉంటాడు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా ఉన్న శర్వానంద్ పెళ్లి గురించి చాలా సంవత్సరాలుగా రకరకాల వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే అతి త్వరలోనే శర్వానంద్ ఓ ఇంటి వాడు కోబోతున్నట్లు తెలుస్తుండగా.. ఎంగేజ్మెంట్ డేట్ కూడా ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. తాజాగా ఈ వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

 

సినీ హీరో శర్వానంద్ ఈ నెల 26వ తేదీన తాను ప్రేమిస్తున్న అమ్మాయితో ఎంగేజ్మెంట్ చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ లోని పార్క్ హయత్ లో శర్వానంద్ అతి తక్కువ మంది అతిథుల సమక్షంలో ఎంగేజ్మెంట్ చేసుకోబోతున్నట్లు ఓ ఇన్విటేషన్ కార్డ్ నెట్టింట వైరల్ అవుతోంది. అందులో శర్వానంద్ పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయి పేరు పద్మగా తెలుస్తోంది.

 

రెడ్డి సామాజిక వర్గానికి చెందిన అమ్మాయిని శర్వానంద్ పెళ్లి చేసుకోబోతుండగా.. ఆమె మాజీ మంత్రి మనవరాలు అని తెలుస్తోంది. జనవరి 26వ తేదీ ఉదయం గం.11.04ని.లకు శర్వానంద్-పద్మల ఎంగేజ్మెంట్ జరగబోతోందనే వార్త ఇప్పుడు చాలామందిలో చర్చకు దారితీసింది. మొత్తానికి టాలీవుడ్ కు చెందిన ఓ మోస్ట్ బ్యాచిలర్ హీరో త్వరలోనే ఇంటి వాడు కాబోతున్నాడని.. మిగిలిన హీరోలు కూడా ఇదే కోవలో ఆలోచించాలని సినీ అభిమానులు ఆశిస్తున్నారు.

 

శర్వానంద్ ఓ పొలిటికల్ నేపథ్యం ఉన్న కుటుంబానికి చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకోబోతుండగా.. జనవరి 26న ఎంగేజ్మెంట్, ఏప్రిల్ లో పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. శర్వానంద్ డెస్టినేషన్ మ్యారేజ్ చేసుకోబోతున్నాడని.. ఇందుకు సంబంధించి ఇప్పటికే పనులు కూడా పూర్తి చేసినట్లు సమాచారం.

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -