Vijay Devarakonda-Samantha: విజయ్ సమంతలకు షాకిచ్చే హీరోయిన్ ఆమేనా?

Vijay Devarakonda-Samantha: సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ సమంత జంటగా డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం ఖుషి. ఈ సినిమా ఇప్పటికి విడుదల కావలసి ఉండగా సమంతకు మయోసైటిస్ అనే వ్యాధి రావడంతో సమంత కొంతకాలం పాటు తాను కమిట్ అయిన సినిమాలకు దూరంగా ఉన్నారు. ఇలా సమంత సినిమాలకు దూరంగా ఉంటూ పూర్తిగా చికిత్స తీసుకున్న అనంతరం తిరిగి తన సినిమా షూటింగ్ పనులలో బిజీ అయ్యారు.

ఈ క్రమంలోనే ప్రస్తుతం ఖుషి సినిమా శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది.ఇక ఈ సినిమా గత ఏడాది డిసెంబర్ నెలలో విడుదల కావాల్సి ఉండగా వాయిదా పడి తిరిగి సెప్టెంబర్ 1వ తేదీ విడుదలకు సిద్ధమైంది.శరవేగంగా షూటింగ్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా గురించి తాజాగా ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇందులో సమంత విజయ్ దేవరకొండ హీరో హీరోయిన్లుగా నటిస్తుండగా ఇందులో మరొక హీరోయిన్ కూడా నటించబోతుందని తెలుస్తుంది.

 

ఈ సినిమాలో సమంతకు చెల్లెల పాత్రలో మరొక నటి పాత్ర ఉండబోతుందని అయితే ఆ పాత్రలో నటి దివ్యాంశ కౌశిక్ నటించబోతున్నారని తెలుస్తోంది. ఈమె సమంతకు చెల్లెలుగా ఈ సినిమాలో నటిస్తోంది అంటూ పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.అయితే ఈ విషయం గురించి ఎలాంటి అధికారిక ప్రకటన లేకపోయినా ఈ విషయం మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఒకవేళ ఇదే కనుక నిజమైతే దివ్యంశా కౌశిక్ పాత్ర ఎలా ఉంటుందో తెలియాల్సి ఉంది.

 

ఇక ఈ విషయంలో ఎంతవరకు నిజముందో తెలియాలి అంటే చిత్ర బృందం అధికారకంగా తెలియజేయాల్సి ఉంది.ఇక సమంత విజయ్ దేవరకొండ ఇదివరకే కీర్తి సురేష్ నటించిన మహానటి సినిమాలో వీరిద్దరూ జర్నలిస్టు పాత్రలలో నటించారు. ఇలా వీరిద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ మంచిగా వర్కౌట్ అవడంతో తిరిగి వీరిద్దరూ జంటగా ఖుషి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. మరి ఈ సినిమా ద్వారా వీరిద్దరూ ఎలాంటి సక్సెస్ అందుకుంటారో తెలియాల్సి ఉంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -