Pawan: పవన్ పై పరువు నష్టం కేసు వేసింది ఆమేనా.. పవన్ కు షాక్ తప్పదా?

Pawan: ఏపీలో వాలంటీర్ల పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అనుచిత వాక్యాలు చేసిన విషయం తెలిసిందే. పవన్ చేసిన అనూష వాక్యాలు రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపాయి. దీంతో పవన్ కళ్యాణ్ పై వాలంటీర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఒక మహిళ వాలంటీర్ విజయవాడ కోర్టును ఆశ్రయించారు. పవన్ కళ్యాణ్ పై వాలంటీర్ కేసు ఫైల్ చేశారు విజయవాడ సివిల్ కోర్టులో పవన్ కళ్యాణ్ పై క్రిమినల్ డెఫినేషన్ కేసు నమోదు అయింది.

వాలంటీర్ ఇచ్చిన కేసును న్యాయమూర్తి స్వీకరించారు తమపై పవన్ కళ్యాణ్ చేసిన అనుచిత వాక్యాల పట్ల మానసిక వేదనకు గురయ్యానని న్యాయం చేయాలని మహిళా వాలంటీర్ కోర్టుని ఆశ్రయించారు. వాలంటీర్ తరపున న్యాయవాదులు కేసు దాఖలు చేశారు. విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని న్యాయవాదులు కోరారు. బాధితురాలు పవన్ కళ్యాణ్ వాక్యాల పట్ల మనోవేదనకు గురైందని వాలంటీర్ తరపు న్యాయవాదులు తెలిపారు.

 

ఆశ్రయించిన తర్వాత కచ్చితంగా విచారణ జరుగుతుందన్నారు. బాధితురాలు స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ కు కోర్టు నోటీసులు ఇస్తుందని తెలిపారు. పవన్ కోర్టుకు హాజరు కావాల్సి ఉంటుందని తెలిపారు. కోర్టు విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. ఉమెన్ ట్రాఫికింగ్ కు సంబంధించి కేంద్ర నిఘా వర్గాలు పవన్ కు చెప్పి ఉంటే ఆ ఆధారాలను కోర్టుకు వెల్లడించాలన్నారు.

 

ప్రభుత్వానికి సహాయకులుగా ఉన్న వాలంటీర్లపై పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు సరికాదని అభిప్రాయపడ్డారు. పవన్ వాక్యాల తర్వాత తనను చుట్టుపక్కల వారు ప్రశ్నించారని వెల్లడించారు. నిస్వార్ధంగా సేవ చేస్తున్న తమపై నిందలు వేసి పవన్ తప్పు చేశారని వెల్లడించారు. పవన్ కళ్యాణ్ ను చట్టపరంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -