Guntur Kaaram: గుంటూరు కారం ట్రైలర్ ఫ్యాన్స్ కు నచ్చలేదా.. ఏం జరిగిందంటే?

Guntur Kaaram: 2024 సంక్రాంతికి విడుదల అవుతున్న తెలుగు సినిమాల్లో మోస్ట్ అవైటెడ్ మూవీ సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో వస్తున్న సినిమా గుంటూరు కారం. ఈ సినిమాపై మహేష్ బాబు అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి. సినిమా విడుదల కి ఇంకా ఐదు రోజులు మాత్రమే సమయం ఉండటంతో మేకర్స్ ట్రైలర్ ని విడుదల చేశారు. ట్రైలర్ చూసిన ప్రేక్షకులు పక్కాగా అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ ఆలోచనతో కట్ చేశారు తప్ప ట్రైలర్లో ఓ త్రెడ్ కనిపించలేదంటూ పెదవి విరుస్తున్నారు.

 

దర్శకుడు త్రివిక్రమ్ బ్యాక్ అండ్ డైలాగ్ తో ట్రైలర్ స్టార్ట్ కావడం విశేషం కానీ టోటల్ ట్రైలర్ మొత్తం మీద ఎక్కడా ఇది త్రివిక్రమ్ మార్క్ డైలాగ్ అన్నది ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు. చిన్నప్పుడు కొట్టాల్సిన అమ్మ ఇప్పుడు పెద్దయ్యాక ఇస్త్రీ చీర కట్టుకొచ్చి కొడుతుంది అనే డైలాగ్ ట్రైలర్ లో వినిపించినప్పటికీ అందులో త్రివిక్రమ్ మార్కు కనిపించకపోవడం విశేషం.

తల్లి కొడుకుల సెంటిమెంట్ అని చెప్పారు కానీ డెప్త్ కి వెళ్ళలేదు. మహేష్ తో ఎలా ఫైట్లు చేయించాలి? ఎలా పంచులు వేయించాలి ఇవే చూసుకున్నారు తప్పితే ఎక్కడా కూడా డెప్త్ కి వెళ్ళినట్టు ట్రైలర్ లో కనిపించలేదు. అలాగే సినిమాలో కీలక పాత్ర అయినా రాహుల్ రామచంద్రన్ పాత్రను కూడా ఎక్కడ చూపించలేదు. చూడగానే మజా వచ్చిందా? హార్ట్ బీట్ పెరిగిందా? ఈలెయ్యాలనిపించిందా? ఈ డైలాగులు ట్రైలర్ చూసిన తర్వాత జనం చెప్పాలి.

 

కానీ త్రివిక్రమ్ శ్రీనివాస్ మాత్రం తనకు తానే ఈ డైలాగ్ చెప్పుకుంటున్నట్లు అనిపించింది ఈ ట్రైలర్ చూస్తే. ట్రైలర్ కేవలం మహేష్ బాబు ఫ్యాన్స్ కి మాత్రమే నచ్చవచ్చు. అలా అని సినిమాని తక్కువగా ఉంచడం వేయటానికి లేదు. త్రివిక్రమ్ డైరెక్షన్ ని అంత తేలిగ్గా తీసుకుంటే మనం పప్పులో కాలేసినట్లే కాకపోతే ట్రైలర్ కట్ కు అంత టైం సరిపోయి ఉండకపోవచ్చు. గుంటూరు కారానికి కారం తగ్గిందా లేదా అన్నది మరొక ఐదు రోజుల్లో ఎలాగో తెలిసిపోతుంది.

Related Articles

ట్రేండింగ్

YS Sharmila: షర్మిల ఎఫెక్ట్ తో క్రిస్టియన్ ఓట్లు దూరం.. ఇక వైసీపీకి ప్రశాంతత కరువైనట్టేనా?

YS Sharmila: రాజకీయ నాయకులు ఒక్కొక్కరు ఒక్కొక్క ఆస్త్రాన్ని ఆయుధంగా వాడుకుంటు ప్రత్యర్థులపై ప్రయోగిస్తున్నారు . అలాగే షర్మిల క్రిస్టియన్ కమ్యూనిటీ అనే పదాన్ని వాడుకుంటున్నారు. పదేపదే మన మతం అంటూ వైఎస్...
- Advertisement -
- Advertisement -