Sreeleela-Mahesh: మహేష్ పై ప్రేమను కురిపించిన శ్రీలీల.. అలాంటి కామెంట్లతో?

Sreeleela-Mahesh: పెళ్లి సందడి సినిమాతో ఏ ముహూర్తాన టాలీవుడ్ లో అడుగు పెట్టిందో గాని శ్రీలీల సినిమాలు మీద సినిమాలు చేసుకుంటూ పోతుంది. మామూలుగానే ఎనర్జిటిక్ గా కనిపించే శ్రీ లీల గుంటూరు కారం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మరింత హడావిడి చేసింది. తన మాటలతో, పాటలతో, డాన్స్ తో ప్రేక్షకులతో పాటు మహేష్ బాబుని సైతం ఉర్రూతలూగించింది.

 

సినిమాలో ఎంత హుషారుగా కనిపిస్తుందో బయట కూడా అంతే హుషారుగా ఉంటుంది ఈ భామ. అయితే ఈ ఈవెంట్ లో శ్రీ లీల ఇచ్చిన స్పీచ్ ఇప్పుడు హైలైట్ గా మారింది. ఆమె మహేష్ బాబుని గురించి మాట్లాడుతూ ఉంటే మహేష్ బాబు సైతం ఎమోషనల్ అయిపోయాడు. మహేష్ బాబు గారితో సినిమా చేస్తున్నంతసేపు ఆయననే చూస్తూ ఉండిపోయే దాన్ని, డైలాగులు కూడా మర్చిపోయేదాన్ని.

ఈ అనుభవం ఎప్పటికీ మర్చిపోలేను అంటూ చెప్పుకోచిన ఈ భామ బంగారు విగ్రహానికి ప్రాణం పోస్తే అదే మహేష్ బాబు అంటూ ఒక్క మాటతో మహేష్ ని ఫ్లాట్ చేసేసింది. ఇక త్రివిక్రమ్ గురించి మాట్లాడుతూ దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు పెళ్లి సందడితో తనని లాంచ్ చేస్తే త్రివిక్రమ్ తనని రీ లాంచ్ చేశారని చెప్పుకొచ్చింది. అలాగే ఎన్నో పుస్తకాలు చదివిన అనుభవం మాటల్లో పాటల్లో త్రివిక్రమ్ ధారబోశారని ఆయనతో పనిచేయడం వల్ల ఎన్నో విషయాలు నేర్చుకుంటున్నానని చెప్పుకొచ్చింది.

 

ఈమె స్పీచ్ కి ప్రేక్షకులందరూ ఫిదా అయిపోయారు త్రివిక్రమ్ సినిమాలో చేసింది కదా ఆ మాత్రం మాటల గారడీ చేయకపోతే ఎలా అంటూ సెటైర్లు వేస్తున్నారు. ఇక శ్రీలీలకి ఈ సినిమా హిట్ అవ్వడం చాలా అవసరం. 2023లో ఆమెకి ఎదురుదెబ్బలు గట్టిగానే తగిలాయి. మూడు ఫ్లాపులతో కెరియర్ అటు ఇటుగా ఉన్న సమయంలో త్రివిక్రమ్సినిమాలో హీరోయిన్ గా చేయటం నిజంగా ఈమె అదృష్టం. ఎందుకంటే త్రివిక్రమ్ సినిమాల్లో హీరోయిన్ పాత్రలకు మంచి గుర్తింపు ఉంటుంది. ఈ సినిమాతో అయినా ఆమె కెరియర్ ఊపందుకుంటుందేమో చూడాలి.

Related Articles

ట్రేండింగ్

RTO Padmavati: ఏపీ రాజకీయాలలో హాట్ టాపిక్ అవుతున్న ఆర్డోవీ పద్మావతి.. వైసీపీ కోసం ఇంత చేస్తున్నారా?

RTO Padmavati:ఎన్టీఆర్ కృష్ణ జిల్లాలలో ప్రధాన పార్టీ అభ్యర్థుల నామినేషన్ పరిశీలన ప్రక్రియ తీవ్రస్థాయిలో ఉత్కంఠత నెలకొంది. ముఖ్యంగా గుడివాడ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి కొడాలి నాని నామినేషన్ విషయంలో తీవ్రస్థాయిలో...
- Advertisement -
- Advertisement -