Balayya Wig: స్టార్ హీరో బాలకృష్ణ విగ్గు కోసమే అంత ఖర్చు చేస్తున్నారా?

Balayya Wig: నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం యంగ్ హీరోలకు పోటీగా వరుస సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నారు. ఇలా బాలకృష్ణ హీరోగా ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో భగవంత్ కేసరి అనే సినిమాలో నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమా తర్వాత బాలకృష్ణ డైరెక్టర్ బాబి దర్శకత్వంలో మరో సినిమాకు సిద్ధమయ్యారు. ఇలా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి బాలకృష్ణ గురించి ఓ వార్త ప్రస్తుతం వైరల్ గా మారింది.

బాలకృష్ణ ప్రతి సినిమాలను విగ్గు ధరిస్తారు అనే విషయం మనకు తెలిసిందే.ఈయన సినిమాలలో విగ్గు ధరించడం కోసం ప్రత్యేకంగా వాటిని ముంబై చెన్నై వంటి ప్రాంతాల నుంచి తెప్పిస్తారని ఇదివరకే బాలకృష్ణ పర్సనల్ మేకప్ మ్యాన్ వాసు కొప్పిశెట్టి రీసెంట్గా జరిగిన ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఇక ఈయన కోసం ప్రత్యేకంగా డిజైన్ చేయించి తెప్పిస్తామని తెలిపారు.

 

ఇక సినిమాలలో బాలకృష్ణ ఉపయోగించే విగ్గు చాలా ఖరీదైనవని అలాంటివి మన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏ హీరోలు కూడా వాడారని వాసు కొప్పిశెట్టి వెల్లడించారు. ఇక బాలకృష్ణ ధరించే ఒక్కో విగ్గు దాదాపు రెండు లక్షల రూపాయల వరకు విలువ చేస్తాయట. ఇలా బాలయ్య విగ్గుల కోసమే ఈ స్థాయిలో ఖర్చు చేస్తారని తెలుస్తోంది.ఇలా బాలకృష్ణ విగ్గు ధర తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు అయితే ఏ సినిమాలో అయితే బాలయ్యకు విగ్గు సరిగ్గా సెట్ అవుతుందో ఆ సినిమా సూపర్ హిట్ అనే సెంటిమెంట్ కూడా ఉంది.

 

ఈ సెంటిమెంట్ ఉండడంతో బాలయ్య విగ్గు కోసం నిర్మాతలు కూడా ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుంటారని అలాగే ఆ విగ్గు కోసం ఖర్చు చేసే డబ్బు మొత్తం నిర్మాతలే భరిస్తారని తెలుస్తోంది. ఇలా బాలకృష్ణ సినిమాల విషయంలో విగ్గు కోసం ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుంటారని తెలిసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -