Balayya: నిర్మాతల కోసం స్టార్ హీరో బాలకృష్ణ మాత్రమే అలా చేస్తారా?

Balayya: టాలీ వుడ్ స్టార్ హీరోగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న వారిలో నందమూరి నట సింహం బాలకృష్ణ ఒకరు. ప్రస్తుతం బాలకృష్ణ వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం బాలకృష్ణ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ పనులతో బిజీగా ఉన్నారు. ఇక ఈ సినిమాలో బాలయ్య సరసన వెండితెర చందమామ కాజల్ అగర్వాల్ నటిస్తున్నారు. ఇలా బాలయ్య కాజల్ అగర్వాల్ జంటగా ఈ సినిమా మొదటి సినిమా కావడం విశేషం.

ఇక ఈ సినిమా భారీ బడ్జెట్ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇకపోతే ఈ సినిమా కోసం బాలకృష్ణ 20 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారని తెలుస్తోంది.ఇండస్ట్రీలో ఎంతో క్రేజ్ ఉన్నటువంటి బాలకృష్ణ డిమాండ్ చేస్తే ఒక్కో సినిమాకు 50 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ ఇచ్చిన నిర్మాతలు ఉన్నారు అయినప్పటికీ బాలకృష్ణ మాత్రం 20 కోట్ల రెమ్యూనరేషన్ మాత్రమే తీసుకుంటున్నారు.

 

రెమ్యూనరేషన్ విషయంలో బాలకృష్ణ ఎంతో గ్రేట్ అని ఈ విషయంలో ఈయనకు ఎవరు సాటిరారంటూ పలువురు బాలయ్య పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇలా బాలకృష్ణ వంటి ఒక స్టార్ హీరో తక్కువ రెమ్యూనరేషన్ కి సినిమాలు చేయడంతో ఈయనతో సినిమాలు చేయటానికి నిర్మాతలు సైతం క్యూ కడుతుంటారు. ఇక బాలయ్య నిర్మాతల హీరో అని కూడా పిలుస్తుంటారు. నిర్మాతకు ఇలాంటి ఇబ్బంది లేకుండా తక్కువ రెమ్యూనరేషన్ కి సినిమా చేసే ఏకైక స్టార్ హీరో బాలకృష్ణ అని చెప్పాలి.

 

ఈయనతో పాటు స్టార్ డమ్ ఉన్నటువంటి హీరోలు ఒక్కో సినిమాకు దాదాపు 50 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ అందుకుంటున్నారు. కానీ బాలయ్య మాత్రం అలా కాదని ఈయన నిర్మాతకు రెమ్యూనరేషన్ విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా వ్యవహరిస్తారని చెప్పాలి. ఇక బాలయ్య అనిల్ రావిపూడి కాంబినేషన్లో రాబోతున్న సినిమా ప్రస్తుతం షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల కాగా ఈ పోస్టర్ కి అనూహ్యమైన స్పందన లభించి సినిమాపై భారీ అంచనాలను పెంచేసింది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -