Prabhas: ప్రభాస్ కు మాత్రమే ఇలాంటి రికార్డులు సాధ్యమవుతాయా.. ప్రభాస్ స్టామినా ఇదీ అనేలా?

Prabhas: చాలా కాలం తర్వాత డార్లింగ్ ప్రభాస్ ఫుల్ మాస్ యాక్షన్ హీరోగా ఆడియన్స్ ముందుకి రాబోతున్నారు. ఇందులో ప్రభాస్ కి జోడిగా శృతిహాసన్ నటించగా మలయాళీ హీరో పృధ్విరాజ్ సుకుమారన్ ప్రతినాయకుడిగా, మరొక కీలక పాత్రలో విలక్షణ నటుడు జగపతిబాబు నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. భారీ బడ్జెట్ పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్న ఈ సినిమాపై భారీగానే అంచనాలు ఉన్నాయి.

అంచనాలకి తగినట్లుగానే మొన్న రిలీజ్ అయిన గ్లింప్స్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అలాగే మరొక రికార్డు కూడా నెలకొల్పటానికి సిద్ధంగా ఉన్నాడు ప్రభాస్. ఇంతకీ ఏం జరిగిందంటే మామూలుగానే ఈ సినిమాని పది భాషలలో రిలీజ్ చేస్తామని చెప్పుకొచ్చారు మూవీ మేకర్స్. అలాగే ఇంగ్లీష్ వెర్షన్లో విదేశాలలో కూడా విడుదల చేయడానికి సిద్ధపడ్డారు. మామూలుగా అయితే ఇక్కడ విడుదల అయిన ఒక వారం పది రోజుల తర్వాత విదేశాలలో రిలీజ్ అవుతుంది.

 

కానీ ఇక్కడ ప్రభాస్ స్టామినా ఇది అనేలా ప్రశాంత్ ని ఇంగ్లీష్ వర్షన్ కూడా లోకల్ లాంగ్వేజెస్ లో రిలీజ్ అయిన రోజునే రిలీజ్ చేయటానికి ప్లాన్స్ వేస్తున్నాడు. ప్రభాస్ యొక్క ఫ్యాన్స్ ని ప్రపంచ సినీ అభిమానులని దృష్టిలో పెట్టుకొని ఇంగ్లీష్ వర్షన్ ని హాలీవుడ్ సినిమాలకు దీటుగా సిద్ధం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. సౌండ్ మేకింగ్ డబ్బింగ్ విషయంలో కూడా స్పెషల్ కేర్ తీసుకుంటున్నారట. కన్నడ స్టార్ యష్ నటించిన కేజిఎఫ్ 2 బ్లాక్ బస్టర్ తర్వాత డైరెక్టర్ ప్రశాంత్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుంది.

 

ఇది మదర్ సెంటిమెంట్ తో పాటు ఫ్రెండ్షిప్ అంశాలని కూడా ప్రశాంత్ నీల్ టచ్ చేయబోతున్నట్లు తెలిసింది. గ్యాంగ్స్టర్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాని ప్రశాంత్ ని తెరకెక్కించడంతో అన్ని భాషలలోని భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఇదే అంచనాలు విదేశాలలో కూడా కనిపిస్తున్నాయి. ప్రభాస్ కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అలాంటిది అందుకే ప్రశాంత్ ని తెలివిగా ఆలోచించి ఇక్కడ సలార్ రిలీజ్ అయిన డేట్ కి అక్కడ కూడా రిలీజ్ చేయడానికి తగిన ఏర్పాట్లు చేస్తున్నాడు. ఇదే జరిగితే ప్రభాస్ కెరియర్ లో మరొక రికార్డు యాడ్ అయినట్టే.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -