Padma Rao Goud: నర్సయ్యగౌడ్ బాటలో మరో సీనియర్ నేత..? కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో చర్చలు

Padma Rao Goud: తెలంగాణలో మునుగోడు ఉపఎన్నిక క్రమంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. టీఆర్ఎస్ నేతలను తమవైపుకి తిప్పుకుని సీఎం కేసీఆర్‌కు షాకిచ్చేలా కాషాయదళం చక్రం తిప్పుతోంది. బీజేపీలోకి చేరికలను ప్రోత్సహించడం ద్వారా మునుగోడు ఉపఎన్నిక క్రమంలో టీఆర్ఎస్ నేతల ఆత్మస్థైర్యం దెబ్బతీసేందుకు బీజేపీ ప్రయత్నాలు కొనసాగిస్తోంది. టీఆర్ఎస్‌లో అసంతృప్తిగా ఉన్న నేతలను చేరదీసేందుకు కమల పార్టీ వర్గాలు ప్రయత్నాలు చేస్తోన్నాయి. ఇప్పటికే మునుగోడు టికెట్ దక్కడంతో టీఆర్ఎస్ లో అసంతృప్త నేతగా ఉన్న భువనగిరి మాజీ ఎంపీ నర్సయ్యగౌడ్ ను బీజేపీ ఆకర్షించింది.

ఈ నెల 19న నర్సయ్యగౌడ్ బీజేపీలో చేరేందుకు సిద్దమవుతున్నాయి. మునుగోడులో బీసీ ఓట్లు ఎక్కువ ఉండటంతో.. నర్సయ్యగౌడ్ చేరిక బీజేపీలోకి కలిసొస్తుందనే అభిప్రాయాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. హైదరాబాద్ లో 19న బీసీ గర్జన సభకు బీజేపీ ప్లాన్ చేస్తోంది. ఈ సభలో నర్సయ్యగౌడ్ కాషాయ కండువా కప్పుకుంటారని తెలుస్తోంది. ఇక మునుగోడు నియోజకవర్గంలో బీసీలతో బహిరంగ సభ నిర్వహించనున్నారని, ఇందులో నర్సయ్యగౌడ్ తో మాట్లాడించనున్నారని తెలుస్తోంది. బీసీల ఓట్లే అస్త్రంతో నర్సయ్యగౌడ్ తో విస్తృతంగా బీజేపీ ప్రచారం చేయనుంది.

ఈ నేపథ్యంలో మరో టీఆర్ఎస్ సీనియర్ నేతకు బీజేపీ గాలం వేసినట్లు తెలుస్తోంది. తెలంగాణ డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ తో తాజాగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి భేటీ అయ్యారు. దీంతో ఆయన బీజేపీలో చేరబోతున్నారనే ప్రచారం పొలిటికల్ సర్కిల్స్‌లో హల్ చల్ చేస్తోంది. అంతేకాకుండా వీరి భేటీకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో లీకైంది. ఈ వీడియోను కిషన్ రెడ్డి, పద్మారావు గౌడ్ మాట్లాడుకున్నట్లు ఉంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. నర్సయ్యగౌడ్ బీజేపీలో చేరనున్న క్రమంలో ఆయనతో పాటు మరికొందరు టీఆర్ఎస్ కీలక నేతలు కాషాయ కండువా కప్పుకునే అవకాశముందనే వార్తలు వినిపిస్తున్నాయి.

ఇలాంటి తరుణంలో డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ తో కిషన్ రెడ్డి భేటీ కావడం ప్రాధశాన్యతను సంతరించుకుంది. తాను బీజేపీలో చేరుతానంటూ సోషల్ మీడియాతో జరుగుతున్న ప్రచారంపై పద్మారావు గౌడ్ స్పందించారు. తనపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని క్లారిటీ ఇచ్చారు. అవన్నీ తప్పుడు వార్తలని కొట్టిపారేశారు. తాను పార్టీ మారుతానంటూ వస్తున్న వార్తలు నిరాధారమైవని చెప్పుకొచ్చారు. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలకు తీసుకునేందుకు పోలీసులకు ఫిర్యాదు చేస్తానన్నారు. జై తెలంగాణ… జై కేసీఆర్.. జై టీఆర్ఎస్ అంటూ పద్మారావు గౌడ్ ట్వీట్ చేశారు.

పద్మారావు గౌడ్ క్లారిటీ ఇచ్చిన తర్వాత కూడా సోషల్ మీడియాలో కిషన్ రెడ్డిత ోభేటీ అయిన వీడియో వైరల్ గా మారింది. పద్మారావు గౌడ్ బీసీ సామాజికవర్గానికి చెందిన నేత కావడంతో నర్సయ్యగౌడ్ తో పాటు ఆయన కూడా బీజేపీ గూటికి చేరుతారా అనే చర్చ జరుగుతోంది. మునుగోడులో బీసీ ఓటర్లను ఆకట్టుకునేందుకు టీఆర్ఎస్ లోని బీసీ నేతలకు బీజేపీ గాలం వేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. బీసీ అస్త్రంగా మునుగోడులో గెలిచేందుకు కాషాయ పార్టీ వ్యూహంగా తెలస్తోంది. ఇలాంటి తరుణంలో బీసీ ఓటర్లను ఆకట్టుకునేందుకు ఆ సామాజికవర్గానికి చెందిన పద్మారావు గౌడ్ తో కిషన్ రెడ్డి భేటీ అయినట్లు వార్తలు వస్తున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -