Bigg Boss: బిగ్‌బాస్ హౌస్‌లో అలా జరుగుతోందా.. షాకింగ్ విషయాలు రివీల్!

Bigg Boss: నేటిలో బిగ్‌బాస్ కంటెస్టెంట్స్ ఓటింగ్ లైన్స్ ముగియనున్నాయి. ప్రస్తుతం హౌస్‌లో టాప్-10 కంటెస్టెంట్లలో తొమ్మిది మంది నామినేషన్స్ ఉన్నారు. ఈ వారం కంటెస్టెంట్ రాజ్ సేవ్ అయ్యాడు. ఫైమా కెప్టెన్‌గా ఉండటంతో మిగిలిన ఎనిమిది మంది నామినేషన్‌లో ఉన్నారు. అయితే వీరిలో ఇనయ, రోహిత్ టాప్ ఓటింగ్‌లో దూసుకెళ్తున్నారు. కీర్తి, ఆదిరెడ్డి, శ్రీహాన్ సేవ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మెరీనా, రోహిత్, శ్రీసత్య మాత్రం డేంజర్‌ జోన్‌లో ఉన్నట్లు కనిపిస్తోంది. నిజానికి ఈ వీక్ శ్రీసత్యను ఎలిమినేట్ చేయడానికి ‘ఆపరేషన్ శ్రీసత్య’ నిర్వహించారు. వచ్చే వారం ఫ్యామిలీ వీక్ కావడంతో బిగ్‌బాస్ టీఆర్‌పీ కోసం ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. శ్రీసత్యను సేవ్ చేసి.. మెరీనాను ఎలిమినేట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో సినీ నటి మాధవీలత షాకింగ్ కామెంట్లు చేసింది. శ్రీసత్యను సేవ్ చేయడానికి మెరీనాకు వేసే ఓట్లను డైవర్ట్ చేస్తున్నట్లు పోస్టు రాసుకొచ్చింది. సినీ నటి మాధవీలత బిగ్‌బాస్ షోను రెగ్యులర్‌గా ఫాలొ అవుతుంటారు. తన అభిప్రాయాన్ని షేర్ చేస్తూ.. సోషల్ మీడియాలో మంచి క్రేజ్ సంపాదించుకుంది.

సినీ నటి మాధవీలత మాట్లాడుతూ.. ‘కొన్ని మెసేజ్‌లు చూస్తున్నాను. ఆ ఆడపాము (శ్రీసత్య)ను కాపాడటానికి మెరీనాను ఎలిమినేట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. మెరీనా మిస్ట్ కాల్స్ ను బిగ్‌బాస్ టీమ్ డైవర్ట్ చేస్తున్నారట.’ అని చెప్పుకొచ్చింది. ఇలా చూస్తే.. ‘ఆపరేషన్ శ్రీసత్య’ ఫెయిల్ అయ్యేటట్లు కనిపిస్తోంది. అయితే ఈ పోస్ట్ పక్కన పెడితే.. రోహిత్-మెరీనా ఇద్దరూ హౌస్‌లో కొనసాగుతున్నారు. ఈ వారం మెరీనాను బయటకు పంపితే.. వచ్చేవారం మళ్లీ ఫ్యామిలీ వీక్‌లో మెరీనాను తీసుకురావచ్చు. ఆమెను హౌస్‌లో నుంచి బయటికి పంపడం, తీసుకురావడం వల్ల ఎమోషనల్‌గా కూడా ఆమె ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అయింది. ఇన్ని వారాలు కలిసి ఉన్న భార్యాభర్తల్ని విడగొట్టి బయటకు పంపితే.. ఆ ఎపిసోడ్ మంచి టీఆర్‌పీ వస్తుందని బిగ్‌బాస్ భావిస్తోంది. అలాగే శ్రీ సత్య తల్లి కదలలేని స్థితిలో ఉంది. ఆమె వీల్‌చైర్‌కి పరిమితం అయింది. ఆ స్థితిలో ఆమెను బిగ్‌బాస్ హౌస్‌లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేయనున్నారు. ఎమోషనల్‌ డ్రామాతో టీఆర్‌పీ పెంచుకునే ఆలోచనలో బిగ్‌బాస్ ప్లాన్ చేస్తున్నట్లు కనిపిస్తోంది.

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -