RamCharan: ఆ హీరోయిన్ అంటే రామ్ చరణ్ కు ఇంత అభిమానమా?

RamCharan: సినిమాల్లో హీరో హీరోయిన్లకు మధ్య రొమాన్స్ అనేది కామనే. అయితే సినిమాలో వారి కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయితే మాత్రం ఆ సినిమా హిట్ అవ్వడం పక్కా. ఆ తర్వాత ఆ హీరోహీరోయిన్ల గురించి చర్చలు సాగుతాయి. నటీనటుల మధ్య కెమిస్ట్రీ వర్కౌౌట్ అయితే వారిద్దరికీ ఎఫైర్ ఉందంటూ పలు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ఇప్పటివరకూ చాలా మంది హీరో హీరోయిన్ల గురించి అలాంటి వార్తలు వైరల్ అవ్వడం చూసుంటాం. ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో మెగాస్టార్ వారసుడిగా మెగా పవర్ స్టార్ గా కొనసాగుతున్నారు రామ్ చరణ్ గురించి కూడా ఓ వార్త వైరల్ అవుతోంది.

ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత రాంచరణ్ చేసిన సినిమాలు తక్కువే అయినా ఎక్కువ విజయాలను పొంది ప్రేక్షకుల మదిలో స్థానం సంపాదించారు. ఇక తాజాగా ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారారు. తండ్రితో కలిసి ఆయన నటించిన ఆచార్య సినిమా అంతగా ఆడలేకపోయినా అందులో నటన పరంగా రామ్ చరణ్ కు ఎక్కువ మార్కులు పడ్డాయి.

ఇప్పటి వరకు ఎంతో మంది హీరోయిన్లతో రామ్ చరణ్ నటించి మెప్పించాడు. కానీ ఏ ఒక్క హీరోయిన్ విషయంలో కూడా ఎఫైర్ ఉందనే వార్తలు రాకపోవడం విశేషం. కానీ అప్పట్లో రామ్ చరణ్ ఒక హీరోయిన్ తో రిలేషన్ షిప్ లో ఉన్నాడంటూ ఓ వార్త సోషల్ మీడియాలో కోడై కూసింది. ఆ హీరోయిన్ ఎవరో కాదు రామ్ చరణ్ తో నటించిన మొదటి సినిమా హీరోయిన్ నేహా శర్మ అని, చిరుత అనే సినిమాతో రామ్ చరణ్ హీరోగా ఎంట్రీ ఇవ్వగా అందులో వీరి కెమిస్ట్రీ అద్భుతంగా పండిందని, అప్పటి నుంచి వీరి స్నేహం అలా కొనసాగుతోందని సమాచారం.

చిరుత సినిమాలో తన హాట్ హాట్ అందాలతో తెలుగు ప్రేక్షకులను నేహా శర్మ ఆకర్షించింది. ఈ క్రమంలోనే కొన్ని మ్యాగజైన్లు చరణ్, నేహా శర్మ ఎంతో క్లోజ్ గా ఉన్న ఫోటోలు షేర్ చేస్తూ వారిద్దరూ రిలేషన్ షిప్ లో ఉన్నారంటూ వార్తలు రాశారు. ఓ ఇంటర్య్వూలో నేహా శర్మ దానికి బదులిచ్చింది. తమ మధ్య స్నేహం మాత్రమే ఉందని తెలిపింది. నేహా శర్మ అంటే రామ్ చరణ్ కు చాలా అభిమానమని, అప్పుడప్పుడు వీరిద్దరూ కలుస్తుంటారని ప్రస్తుతం సోషల్ మీడియాలో వార్తలు షికారు చేస్తున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -