Kiran Abbavaram: ఆ హీరోయిన్ అంటే కిరణ్ కు ప్రాణమా.. అసలేం జరిగిందంటే?

Kiran Abbavaram: అప్పుడప్పుడు తెరపైకి నటీనటుల ప్రేమ వ్యవహారాలు వచ్చి బాగా హాట్ టాపిక్ గా మారుతుంటాయి. చాలావరకు నటీనటులు తమ ప్రేమ విషయాలను బయటపడకుండా జాగ్రత్తగా ఉంచుతారు. కానీ కొన్ని కొన్ని సార్లు అవి బయటపడుతూ ఉంటాయి. అయితే తాజాగా ఒక హీరో హీరోయిన్ ప్రేమాయణం కూడా ఒక ఫోటో ద్వారా బయటపడింది. ఇంతకు వాళ్ళు ఎవరో కాదు కిరణ్ అబ్బవరం, రహస్య గోరక్.

 

అయితే వీరిద్దరూ రాజావారు రాణి గారు అనే సినిమాతో తొలిసారిగా హీరో హీరోయిన్ గా పరిచయమయ్యారు. ఇక ఈ సినిమా వీళ్లకు మంచి సక్సెస్ అందించింది. ఇక ఈ సినిమా సమయంలో వీరి మధ్య మంచి స్నేహబంధం కూడా ఏర్పడింది. ఆ తర్వాత కిరణ్ అబ్బవరం పలు సినిమాలు చేస్తూ ముందుకు వెళ్తున్నాడు.

కానీ హీరోయిన్ రహస్యకు మాత్రం అంతగా అవకాశాలు లేవు. అయినప్పటికీ వీరిద్దరూ బాగా క్లోజ్ గా మూవ్ అవుతున్నారు. అయితే ఇదంతా పక్కన పెడితే వీరిద్దరూ సోషల్ మీడియాలో బాగానే యాక్టివ్ గా ఉంటారు. ఇక గత కొన్ని రోజుల నుండి వీరిద్దరి మధ్య ప్రేమాయణం నడుస్తుంది అని జోరుగా అనుమానాలు వచ్చాయి. కానీ ఏ రోజు కూడా వీరిద్దరూ ఈ విషయం గురించి స్పందించలేదు.

 

అయితే ప్రస్తుతం కిరణ్ అబ్బవరం కాశ్మీర్ ట్రిప్ కి వెళ్ళగా దానికి సంబంధించిన ఫోటోలను పంచుకున్నారు. ఇక రహస్య కూడా అటువంటి లోకేషన్ కి సంబంధించిన ఫోటో నే పంచుకోవడంతో ఆ రెండు ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. దీంతో వీరిద్దరూ ఒకే దగ్గర ఉన్నారని అందరికీ అర్థమయింది. ఇక వీరిద్దరూ నిజంగానే ప్రేమలో ఉన్నారు అని కొందరు గట్టిగా నమ్ముతున్నారు. మరి ఈ విషయం గురించి వీరిద్దరూ ఏమని స్పందిస్తారో చూడాలి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -