Chiranjeevi: ఆ యంగ్ హీరో మెగాస్టార్ మాటల వల్ల బాధ పడ్డారా?

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి- ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు. ఎలాంటి సపోర్ట్ లేకుండా తన కంటూ ఒక గుర్తింపు సాధించుకున్న నటులు. సుప్రీమ్ హీరో నుంచి మెగా స్టార్ గా చిరంజీవి ఎదిగిన తీరు ఎందరికో ప్రోత్సాహం. 90లలో చిరంజీవి ప్రభ ఎలా ఉండేదంటే అమితాబ్ బచ్చన్ కంటే కూడా మన మెగాస్టార్ ఎక్కువ సంపాదించేవారు ఆయన సినిమాలు కూడా ఎక్కువ లాభాలు తెచ్చేవి.

 

యంగ్ హీరోకి చిరంజీవి మాటలు తెచ్చిన తంటా!

అలాంటి చిరంజీవి చెప్పిన మాటలు ఒక యంగ్ హీరోకి ఇబ్బందులు తెచ్చిపెట్టాయి. ట్విట్టర్ లో పెట్టిన ఒక ట్వీట్ టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం కి నచ్చలేదు. నచ్చకపోవడం మాత్రమే కాదు ఈ యంగ్ హీరో బాగా హార్ట్ అయ్యాడట. అసలు చిరంజీవి చెప్పిన మాటలను ఏంటి? యంగ్ హీరోకి దానికి ఉన్న సంబంధం ఏంటి అనేది ఒకసారి చూద్దాం.

సంక్రాంతికి చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాతో రాబోతున్న విషయం తెలిసిందే. దీనికి తగ్గట్టుగా కొన్ని రోజుల క్రితం భారీ ఎత్తున ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. సభకి విచ్చేసిన వారిని ఉద్దేశించి ఒక మంచి స్పీచ్ ఇచ్చారు . పక్కనే ఉన్న మాస్ మహారాజ రవితేజని ఉద్దేశించి రవితేజ తను వరుసగా సినిమాలు తీస్తున్నాం అని అన్నారు.అయితే ఆ వీడియోని మార్ఫింగ్ చేశారు నెట్టింట పెట్టారు నెటిజన్లు.

 

ఈ వీడియోని మార్ఫింగ్ చేసి చిరంజీవి ఫేస్ మీద కిరణ్ అబ్బవరం ముఖాన్ని పెట్టి రవితేజ ముఖానికి ఆది సాయి కుమార్ ముఖాన్ని పెట్టారు. ఈ యంగ్ హీరోలు వరుసగా సినిమాలు చేస్తున్నారు కాబట్టి వారిని టార్గెట్ చేస్తున్నట్టుగా ఉంటుంది ఈ వీడియో. పోస్ట్ కింద కామెంట్లు కూడా ఈ హీరోలని టార్గెట్ చేశాయి. ఈ ట్వీట్ కి రియాక్ట్ అయిన కిరణ్ అబ్బవరం తన మూడు సంవత్సరాల కెరీర్ లో 5 సినిమాలు మాత్రమే వచ్చాయి. ఒకవేళ తనకి తెలియకుండా ఏవైనా సినిమాలు వచ్చి ఉంటే చెప్పండి అంటూ అడిగారు. ఈ ట్వీట్ చూసిన చాలా మంది యంగ్ హీరో ఫీల్ అయ్యాడు అంటూ రియాక్ట్ అవుతున్నారు

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -