Nandita: నటి నందిత ఇండస్ట్రీకి దూరం కావడానికి అదే కారణమా?

Nandita: సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లకు లైఫ్ స్పాన్ తక్కువగా ఉంటుందనే విషయం మనకు తెలిసిందే. వీరికి కెరియర్ మొదట్లోనే అవకాశాలు వచ్చాయంటేనే కొంతకాలం పాటు ఇండస్ట్రీలో కొనసాగుతారు. కెరియర్ మొదట్లోనే ఒడిదుడుకులు ఎదుర్కొంటే అలాంటి వాళ్ళు తొందరగా ఇండస్ట్రీలో కనుమరుగవుతారనే విషయం మనకు తెలిసిందే.అందుకే అవకాశం ఉన్నప్పుడే ఈ ముద్దుగుమ్మలు భారీ పారితోషకం డిమాండ్ చేస్తూ లైఫ్ లో సెటిల్ అవుతూ ఉంటారు.

ఇండస్ట్రీలో కొంతమంది హీరోయిన్స్ కెరియర్ మొదట్లోనే మంచి సినిమా అవకాశాలు అందుకున్నప్పటికీ తరువాత నటించిన సినిమాలలో విజయం సాధించలేక పూర్తిగా ఇండస్ట్రీకి దూరమైన వాళ్ళు ఉన్నారు. అలాంటి వారిలో నటి నందిత ఒకరు.ఈమె కన్నడ చిత్ర పరిశ్రమలో నందిత లవ్స్ అనే చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అలాగే తమిళంలో అట్టకత్తితో కోలీవుడ్‌లోనూ హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి ఆకట్టుకుంది.

ఈ విధంగా నందిత కన్నడ తమిళ చిత్ర పరిశ్రమలలో ఎంతో మంచి విజయాన్ని అందుకుంది.ఈ సినిమాలు విజయం కావడంతో ఈమెకు మరిన్ని అవకాశాలు వచ్చాయి. అయితే ఆ సినిమాలు ఆశించిన స్థాయిలో ఫలితాలు ఇవ్వలేదని చెప్పాలి.ఇకపోతే తెలుగులో కూడా ఎన్నో అంచనాల నడుమ ఈమె ఎక్కడికి పోతావు చిన్నవాడా అనే సినిమాతో నిఖిల్ సరసన నటించారు. ఇక అప్పటికి నిఖిల్ పెద్దగా గుర్తింపు లేకపోవడంతో ఈమెకు ఈ సినిమా కలిసి రాలేదని చెప్పాలి.

ఈ విధంగా తెలుగు ఎంట్రీ ఇవ్వడంతోనే సరైన సినిమాని ఎంపిక చేసుకోకుండా ఎంట్రీ ఇవ్వడంతో ఇక్కడ కూడా తనకు అవకాశాలు పెద్దగా రాలేదు. అవకాశాలు వచ్చిన సినిమాలలో కూడా ఈమె మెయిన్ లీడ్ కాకపోవడంతో పెద్దగా గుర్తింపు రాలేదు. అయితే ఇప్పటికి నందిత అంటే తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ విధంగా ఈమె వెండి తెరపై అవకాశాలను కోల్పోవడంతో బుల్లితెర కార్యక్రమాల ద్వారా ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. ఇక ఈమె ఈటీవీలో ప్రసారమవుతున్న డాన్స్ షో ఢీకార్యక్రమానికి వ్యవహరిస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -