Pavitra Lokesh: ఆ నటి అందానికి అంత ఖర్చు చేస్తోందా? పవిత్ర లోకేశ్ గురించి షాకింగ్ విషయాలు

Pavitra Lokesh: సినీ నటి పవిత్ర లోకేష్ గురించి ఈ మధ్య ఎక్కువగా సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. నటిగా వందకు పైగా సినిమాల్లో ఆమె నటించారు. అయినా ఆమెకు సరైన గుర్తింపు రాలేదు. అయితే సీనియర్ నటుడు నరేశ్ తో ఆమె పెళ్లికి సంబంధించిన వార్తలు వైరల్ అవ్వడంతో ఆమె ఫేమస్ అయ్యారని చెప్పొచ్చు. కొన్ని నెలలుగా ఆమె పేరు నెట్టింట మారు మోగుతూనే ఉంది.

 

నటుడు నరేష్ ఆమెతో సహజీవనం చేస్తున్నానంటూ ప్రకటించిన తర్వాత ఆమె గురించి గూగుల్ లో చాలా మంది వెతకడం మొదలు పెట్టారు. నరేశ్, పవిత్ర లోకేష్ ఇద్దరూ కలిసి గుడులు గోపురాలు తిరుగుతూ, ప్రత్యేక పూజలు చేస్తూ మీడియా కంట చాలాసార్లు పడ్డారు. దీంతో అప్పట్లో నరేష్, పవిత్ర పెళ్లి చేసుకున్నారంటూ చాలా వార్తలు హల్ చల్ చేశాయి. వాటికి నరేష్ క్లారిటీ ఇచ్చారు కూడా. అప్పట్లో ఇద్దరూ సహజీవనం మాత్రమే చేస్తామని తెలిపారు. ఆ తర్వాత ఏమైందో ఏమోగానీ ఇద్దరూ కలిసి పెళ్లి చేసుకోబోతున్నట్లు వెల్లడించారు.

 

నరేష్ కి దగ్గరయ్యాక పవిత్ర లైఫ్ మారిపోయిందని ఆమె కొన్నిసార్లు మీడియా ద్వారా తెలిపారు. బిజీ ఆర్టిస్ట్ అయిన నరేష్ కోట్ల సంపాదన పొందుతున్నాడు. అలాగే తల్లి విజయనిర్మల నుండి ఆయనకు భారీ మొత్తంలో ఆస్తులు కూడా వచ్చి ఉన్నాయి.

 

తాజాగా పవిత్ర లోకేశ్ పాత ఫోటోలు నెట్టింట దర్శనమిస్తున్నాయి. ఆమె అందం అప్పటికీ ఇప్పటికీ అలానే ఉంది. ఆమె తన అందం కోసం కోట్లు ఖర్చుపెడుతున్నారనే ఒక వార్త టాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. పవిత్ర లోకేష్ తన అందానికి అవసరమైన డైట్, వ్యాయామాలు, ట్రీట్మెంట్, కాస్మొటిక్స్ ఇలా అనేక రకాల సౌందర్య సాధనాల కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుందని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. ఆమె పాత ఫోటోలు వైరల్ అవ్వడంతో చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. అందానికి ఏమి వాడుతారో చెబితే తాము కూడా అది వాడతామని కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం పవిత్ర లోకేశ్ పాత ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -