Pawan: ఆ డైరెక్టర్ పవన్ కళ్యాణ్ ను అలా చూపించబోతున్నారా?

Pawan: తెలుగులో ఎంతోమంది హీరోలు ఉన్నా, హిట్, ప్లాఫ్ లతో సంబంధం లేకుండా సపరేట్ ఫ్యాన్ బేస్, ఫాలోయింగ్ కలిగిన హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. తెలుగు ప్రేక్షకుల్లో తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించిన పవన్ కళ్యాణ్.. సినిమా చేస్తున్నాడంటే దాని మీద విపరీతమైన బజ్ ఏర్పడుతుంది. తర్వాతి సినిమాలో పవన్ ఎలా కనిపిస్తాడు? ఎలాంటి కథతో వస్తాడనే చర్చ ఇండస్ట్రీని ఊపేస్తుంటుంది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ పక్కన సినిమాలు చేస్తూనే, మరోపక్క పాలిటిక్స్ లో యాక్టివ్ గా ఉన్నాడు. త్వరలోనే ఎన్నికలు జరిగే నేపథ్యంలో పాలిటిక్స్ లో జోరు చూపిస్తున్నాడు. అయితే ప్రస్తుతం పవన్, డైరెక్టర్ క్రిష్ తో కలిసి ‘హరిహర వీరమల్లు’ సినిమా చేస్తుండగా.. రకరకాల కారణాల వల్ల ఈ సినిమా విడుదల ఆలస్యం అవుతోంది. ఈ ఏడాది వేసవి రావాల్సిన ఈ సినిమా దసరాకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

తర్వాత డైరెక్టర్ హరీశ్ శంకర్ తో కలిసి ‘భవదీయుడు’ అనే టైటిల్ తో మరో సినిమాకు పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అయితే పవన్ కళ్యాణ్ మరో భారీ, క్రేజీ ప్రాజెక్టుకు ఓకే చెప్పాడనే వార్త ఇప్పుడు ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ పొలిటికల్ లీడర్ గా కనిపించబోతున్నాడని.. దేశ ప్రధానిగా ఆయన వెండి తెర మీద కనిపించబోతున్నారనే వార్త ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తిని రేపుతోంది.

పొలిటికల్ నేపథ్యంలో సాగే కథతో ఓ డైరెక్టర్ కొన్నిరోజుల క్రితం పవన్ కళ్యాణ్ ను కలిశాడని.. అతడు చెప్పిన కథ, కథనం నచ్చిన పవన్ సినిమాకు ఓకే చెప్పాడని సమాచారం. దీంతో ప్రధాని పాత్రలో పవన్ కళ్యాణ్ నెక్ట్స్ లెవల్ యాక్టింగ్ తో అందరినీ ఆశ్చర్యపరుస్తాడని ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ‘హరిహర వీరమల్లు’తో ప్యాన్ ఇండియా లెవల్ సినిమా చేస్తున్న పవన్.. ఈ పొలిటికల్ డ్రామా సినిమాతో దానిని వేరే లెవల్ కి తీసుకెళతాడని ఫ్యాన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -