Tollywood: టాలీవుడ్ సినిమాల లెక్క మారుతోందా.. నరుకుడు నచ్చుతోందా?

Tollywood: ఒకప్పుడు సినిమాలు చక్కనైన విలువలు, కుటుంబ కథలతో కూడుకొని ఉండేవి. కుటుంబ సభ్యులందరూ కూర్చొని చూస్తూ రిలాక్స్ అయ్యే విధంగా తీసేవారు గత తరం దర్శకులు. సినిమాలో ఒక చక్కని కథ ఒక చిన్న మెసేజ్ అక్కడక్కడా చిన్న వినోదం కలగలిపిన సినిమా ఆ రోజుల్లో ప్రేక్షకులకు వినోదాన్ని పంచేవి.

 

అయితే ప్రస్తుత ట్రెండు చూస్తుంటే కధ కథనాలతో సంబంధం లేకుండా విపరీతమైన ఫైటింగ్ లు, కోడిని చంపినంత ఈజీగా మనుషుల్ని చంపడం, నరికివేతలు, కొట్టివేతలు మొత్తానికి బ్లడ్ బాత్ అనాలి. విలన్లందర్నీ చీమల్ని నలిపేసినట్టు నలిపేసిన హీరో బాడీ బ్లడ్ తో ఎరుపెక్కితే సినిమా హిట్ కింద లెక్క. ప్రస్తుత సినిమాలన్నీ అలాగే ఉన్నాయి. కేజిఎఫ్ తో స్టార్ట్ అయిన ఈ ట్రెండ్ దేవర లో కూడా కంటిన్యూ అవుతుంది. దేవర మూవీ నుంచి విడుదలైన గ్లింప్స్ చూస్తే విపరీతమైన బ్లడ్ బాత్ కనిపిస్తుంది.

రక్తంతో అర్థ చంద్రుడిని కాస్త పూర్ణచంద్రుడిగా మార్చిన వైనం చూస్తే తెలుస్తుంది అక్కడ ఎంత బీభత్సమైన ఫైట్ జరిగింది అనేది. ఓజీ సినిమాలో పవన్ కళ్యాణ్ కూడా లెగ్ పీస్ నరికినట్లుగా ఒక మనిషి చేతిని నరికేసి అక్వేరియంలో వేసేయటం చూస్తే ఈ నరుక్కోవడం అనే ట్రెండు ఎంతగా ఫేమస్ అయిందో అర్థం చేసుకోవచ్చు లేటెస్ట్ గా వచ్చిన సలార్ సినిమాలో కూడా ప్రభాస్ కాటేరమ్మ కొడుకుగా విధ్వంసం సృష్టించి బ్లడ్ బాత్ చేశాడు.

 

ఆ సీన్ ఎంత హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఇక ఆ తర్వాత సినిమా లాస్ట్ ఫైట్ లో కూడా ప్రభాస్ విలన్లని ఊచకోత కోస్తూ కోడి పిల్లల్ని నరికినట్లుగా నరికేస్తుంటే ప్రజలు దాన్ని ఎంతగానో ఎంజాయ్ చేసి సినిమాకి కలెక్షన్ల వర్షం కురిపించారు. ఈ ఉత్సాహం చూస్తుంటే ఇంకొక నాలుగు ఐదు ఏళ్ల వరకు హీరోలు నరుకుడు ప్రోగ్రాం లో బిజీగా ఉంటారేమో అనిపిస్తుంది.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -