Janasena: జనసేన పార్టీని శ్రేయోభిలాషులే ఓడిస్తున్నారా.. పార్టీ విషయంలో అక్కడే తప్పు జరుగుతోందా?

Janasena: ఆవేశపరులు రాజకీయాల్లో పనికిరారు. ఈ విషయం చాలా సార్లు ప్రూవ్ అయింది. అంతెందుకు పవన్ తన ఆవేశపూరిత ప్రసంగాలతో సభకు జనాలను రప్పించారు కానీ.. వారిని తమ ఓటర్లుగా మార్చుకోలేకపోయారు. దీంతో.. ఆ తర్వాత ఆయన వైఖరిలో మార్పు వచ్చింది. మార్పు అంటే.. అది మామూలు మార్పు కాదు. ఐదేళ్లలో రాజకీయ పరిపక్వత భారీగా పెరిగింది. వచ్చే ఎన్నికల తర్వాత అసెంబ్లీ అధికార పార్టీగానే అడుపెట్టాలనే వ్యూహంలో పవన్ ఉన్నారు. దానికి తగ్గట్టు అడుగులు వేస్తున్నారు. దీని కోసం నాలుగు మాటలు పడుతూ ఒక సమాధానం చెబుతున్నారు. అయితే, జనసైనికుల పరిస్థితి మాత్రం అందుకు విరుద్దంగా ఉంది. టీడీపీతో పొత్తు పెట్టుకొని తప్పు చేశామనే ఆలోచనలో ఉన్నారు. గత ఎన్నికల్లో సింగిల్ గా పోటీ చేసి ఏం సాధించారో జనసైనికులు గుర్తు చేసుకోవాలి. ఒంటరి పోరాటం చేసి.. ఒకటి అంటే ఒకే ఒక్క స్థానంలో జనసేన సాధించగలిగింది.

పవన్ పోటీ చేసిన రెండు స్థానాల్లో కూడా పవన్ ఓడిపోయారు. అయితే, జనసేన అంత ఘోరంగా ఓడిపోతుందని పవన్ భావించలేదు. గత ఎన్నికల్లో పవన్ త్రిముఖ పోరును అంచనా వేశారు. నిజానికి త్రిముఖ పోరే జరిగింది కానీ.. ఓట్లు వరకే త్రిముఖ పోరు జరిగింది. సీట్ల దగ్గరకు వచ్చే సరిగి ద్విముఖ పోరుగా మారింది. టీడీపీ ఓట్లను చీల్చి జనసేన గెలవకపోగా.. పరోక్షంగా వైసీపీని గద్దెక్కెక్కించింది. అందుకే.. ఈ ఎన్నికల్లో కూడా టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకోకూడదని వైసీపీ చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తుంది. అయితే, వైసీపీ మైండ్ గేమ్‌లో జనసైనికులు పడుతున్నారు. జనసేన సింగిల్‌గా పోటీ చేస్తే.. గత ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే ఈ ఎన్నికల్లో కూడా వస్తాయి. టీడీపీ ఓట్లను జనసేన చీల్చడమే తప్పా.. జనసేన సీట్లు గెలుచుకోవడం జరగదు. గత ఎన్నికల్లో ఒక స్థానానికి పరిమితమైన జనసేన ఈసారి సింగిల్ గా పోటీ చేస్తే.. ఐదు స్థానాలు వరకు గెలుచుకునే అవకాశం ఉండొచ్చు. కానీ, వైసీపీ మరోసారి అధికారంలోకి వస్తుంది.

సీట్ల కేటాయింపులో జనసేనకు అన్యాయం జరిగిందని ఆ పార్టీలో కొందరు తెగ ఆవేశపడుతున్నారు. 24 సీట్లు తమకు చాలా తక్కువ అని కామెంట్స్ చేస్తున్నారు. వాస్తవ పరిస్థితులు ఏంటో తెలియకుండానే 24 స్థానాలకు పవన్ అంగీకరిస్తారా? 24 స్థానాల్లో మెజార్టీ స్థానాలు గెలిచి కూటమి అధికారంలోకి వస్తే గౌరవమైన పోర్టు పోలియోలు తీసుకొని పార్టీని సంస్థాగతం బలోపేతం చేయాలన్నది పవన్ వ్యూహం. అధికారంలోకి రాకుండా ఎన్ని రోజులు ఉన్నా.. క్షేత్ర స్థాయిలో పార్టీ బలోపేతం కాదని పవన్ అర్థం చేసుకున్నారు. కానీ… చాలామంది జనసేన నాయకులు తమకు చంద్రబాబు అన్యాయం చేశాడని.. ప్రశ్నిస్తే.. మళ్లీ పవన్‌తోనే క్లాస్ పీకిస్తున్నారని ఆవేశపడుతున్నారు. ఈ ఆవేశపడే నాయకులు గత ఎన్నికల్లో కనీసం 10 స్థానాల్లో ఎందుకు పార్టీని గెలిపించుకోలేకపోయారు? అనవసరంగా వైసీపీ ట్రాప్‌లో పడి టీడీపీ నేతలను, కార్యకర్తలను దూరం చేసుకుంటున్నారు. ఈ పరిణామాలు కూటమికి దెబ్బలా మారే ప్రమాదం ఉంటుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -