Salaries: ఏపీ పరిస్థితి ఇంత ఘోరంగా ఉందా.. వాళ్ల జీతాలు కూడా పోవడంతో?

Salaries: ప్రస్తుతం ఏపీ ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉందని చెప్పవచ్చు. ఏప్రిల్ నెల 24, 25వ తేదీ అవుతున్న కూడా ఇంకా జీతాలు పడకపోవడంతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. దానికి తోడు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఇచ్చే అరకొర జీతాలను కూడా ఏపీ సర్కార్ వాడుకుంది. దాదాపు 15 ఏళ్ళ నుంచి పని చేస్తున్నప్పటికీ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కేవలం అరకొర జీతాలు మాత్రమే ఇస్తున్నారు. అంతేకాకుండా వారికి ఇచ్చే జీతాలు కూడా కేవలం 20 వేలు లోపు మాత్రమే ఉంటున్నాయి. అలాంటి వారికి సమయానికి జీతాలు ఇవ్వకపోగా వారి జీతాలను కూడా ప్రభుత్వం ఉపయోగించుకుంది.

దాంతో ఏపీలో ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్ గా మారింది. ఆంధ్రప్రదేశ్ టూరిజంలో ఎక్కువ మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులే ఉంటారు. వారికి ఈ నెల జీతాలు ఇరవై మూడో తేదీ వరకూ రాలేదు. సాధారణంగా టూరిజం ఉద్యోగులకు జీతాల సమస్య రాదు. ప్రత్యేక కార్పొరేషన్ అది. ఆ సంస్థకు ప్రత్యేకంగా ఆదాయం ఉంటుంది. ఆ సంస్థ ఉద్యోగులకు జీతాలు చెల్లించుకుంటుంది. అయితే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని శాఖల ఉద్యోగులతో ఓ ఔట్ సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. జీతాలు ఆ కార్పొరేషన్ ద్వారా చెల్లిస్తున్నారు. ఈ జీతాలేమీ ప్రభుత్వం ఇవ్వదు.

 

ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఇవ్వాల్సిన జీతాలను ఆయా కార్పొరేషన్లు, సంస్థలు సమయానికి ఆ ఔట్ సోర్సింగ్ కార్పొరేషన్ ఖాతాలో జమ చేయాలి. ఆ తర్వాత ప్రభుత్వం ఉద్యోగులకు జీతాలుగా వాటిని చెల్లిస్తుంది. ఇప్పుడు టూరిజం కార్పొరేషన్ నుంచి జీతాలు ఔట్ సోర్సింగ్ కార్పొరేషన్ కు జమ అయ్యాయి. వాటిని కూడా ఏపీ ప్రభుత్వం వాడేసుకుంది. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు చెల్లించకపోవడంతో వారు నానా అవస్థలు పడుతున్నారు. అసలే అతి తక్కువ జీతానికి పని చేస్తూంటారు. వారి జీతాలను సక్రమంగా ఇవ్వకపోవడం కాదు కదా అసలు వారి జీతాల్ని కూడా ప్రభుత్వం వాడుకోవడం ఏమిటనేది అందర్నీ ఆశ్చర్య పరుస్తున్న అంశం. టూరిజంలో ఇప్పటికే పునరావసం కింద కొంతమంది రెడ్డి సామాజికవర్గం వారికి పదవులు ఇచ్చారు. వారు లక్షల్లో జీతాలు, ఖర్చులు బిల్లలు డ్రా చేసుకుంటున్నారన్న విమర్ళలు కూడా ఉన్నాయి. వరప్రసాద్ రెడ్డి అనే టూరిజం చైర్మన్ యాభై లక్షలు సంస్థ సొమ్ముతో కారు కొని సొంత అవసరాలకు వాడుకుంటున్నారు. ఆయన విదేశీ పర్యటనల ఖర్చు కూడా టూరిజంపైనే వేస్తున్నారు. ఇలాంటివి లెక్కలేనట్లుగా దుబారాగా ఖర్చు చేస్తూ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు మాత్రం కనీసం జీతాలివ్వలేకపోతున్నారు. ఏపీ ప్రభుత్వానికి కనీసం మానవత్వం లేదన్న విషయం అనేక సార్లు బయటపడుతోంది.

 

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -