AP Govt: ఏపీ ఖజానాలో డబ్బులు లేవా.. వాళ్లకు పెన్షన్ లేట్ కావడం వెనుక అసలు లెక్కలివేనా?

AP Govt: ఏపీలో అసంబ్లీ ఎన్నికలకు నెలన్నర సమయం ఉంది. అంటే ఈ నెల ఫించన్ల పంపిణీతో పాటు.. నెలవారీ జీతాలు ఇంకా పడలేదు. ఇంకా వచ్చే నెల కూడా పడాల్సి ఉంది. ఇవన్నీ ఇప్పుడు నడుస్తున్న ప్రభుత్వం ఆద్వర్యంలోనే జరగాల్సిన పనులు. నిజానికి ఎన్నికలు ఇంత ఆలస్యంగా జరుగుతాయని వైసీపీ అధినేత జగన్ ఊహించలేదు. మార్చిలోనే ఎన్నికలు పూర్తి అవుతాయని అనుకున్నారు. అందుకే, ప్రభుత్వ ఖజానాలో ఉన్న వాటితో పాటు.. అప్పులు తెచ్చిమరీ అస్మదీయ కాంట్రాక్టర్లకు పెండింగ్ బిల్లులు క్లియర్ చేశారు. చివరికి ఖజానా ఖాళీ అయింది. ప్రస్తుతం రాష్ట్రం ఖజానాలో నాలుగు వందల కోట్ల రూపాయలు మాత్రమే ఉన్నాయి. అటు.. అప్పుల పరిమితి కూడా దాటి పోయింది. అసలే ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్న ఏపీ ప్రభుత్వానికి ఈసీ షాక్ ఇచ్చింది. ఎన్నికలు మే 13 అని ప్రకటించడంతో రెండు నెలలు పాటు పాలనను ఎలా నెట్టుకొని రావాలని ప్రభుత్వ పెద్దలు తికమకపడుతున్నారు.

కనీసం ఒకటో తేదీన పెన్షన్ల పంపిణీకి కూడా డబ్బు లేవు. పెన్షన్లు పంపిణీకి 1900 కోట్లు కావాలి. కానీ, ప్రభుత్వం దగ్గర ఇప్పుడు కేవలం 400 కోట్లే ఉన్నాయి. దీంతో.. ఇవాళ అంటే.. ఏప్రిల్ 2న ఆర్బీఐ నుంచి అప్పు రావాల్సి ఉంది. అది కూడా కొత్త ఆర్ధిక సంవత్సరం మొదలైంది కనుక ఆర్బీఐ అప్పు ఇవ్వడానికి ఓకే చెప్పింది. అందుకే.. ఆర్బీఐ నుంచి నిధులు విడుదలైతే.. ప్రభుత్వం పెన్షన్లు పంపిణీ చేస్తుంది. అందుకే ప్రతీ నెల ఒకటో తేదీన వచ్చిన పెన్షన్ల పంపిణీ ఈ నెల రెండో తేదీకి మార్చింది. నిధుల కొరత అని చెబితే అధికార వైసీపీపై వ్యతిరేకత వస్తుందని.. వాలంటీర్లు, ఈసీ నిబంధలను అంటూ కవర్ చేస్తోంది. ఎన్నికల సమయంలో వాలంటీర్లను వారి విధులకు దూరంగా ఉంచాలని ఈసీ, కోర్టులు చెబుతూ వస్తున్నాయి. కానీ, వైసీపీ ప్రభుత్వం ఈసీ ఆదేశాలను పక్కన పెడుతూ వచ్చింది.

చివరికి ఎన్నికల కోడ్ విడుదల కావడం.. ప్రతిపక్షాల ఫిర్యాదులతో వాలంటీర్లు పెన్షన్లు పంచొద్దని మరోసారి ఈసీ ఆదేశించింది. ప్రతిపక్షాలు కుట్రలు చేశాయని.. ఈసీ ఆదేశాలతో వాలంటీర్లు పెన్షన్లు పంపిణీకి దూరంగా ఉన్నారని వైసీపీ ప్రచారం చేస్తోంది. పెన్షన్ల పంపిణీకి వేరే మార్గాలను ఆన్వేషించడంతో పేదలకు పెన్షన్లు ఈ నెల ఆలస్యం అవుతుందని వైసీపీ చెబుతుంది. కానీ.. నిజమైన కారణం నిధుల కొరత. వాలంటీర్లను పెన్షన్ల పంపిణీకి దూరంగా ఉంచుతూనే మరోవైపు ఆ బాధ్యతలను సచివాలయ సిబ్బందికి అప్పగించారు. లబ్ధిదారులు సచివాలయాలకు వెళ్లి పెన్షన్లు తీసుకోవాలని ఆదేశించారు. నిజానికి సచివాలయ సిబ్బంది కూడా విధులకు దూరంగా ఉండాలని గతంలో ఈసీ ఆదేశించింది. ఎందుకంటే సచివాలయ సిబ్బంది ఏపీపీఎస్సీ ద్వారా ఎంపిక కాలేదు. అందుకే.. వారిని పర్మినెంట్ ఉద్యోగులుగా చూడటం లేదు. కాబట్టి.. వారు కూడా ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం ఉందనే ఆరోపణలు ఉన్నాయి.

ఇదిలా ఉండగా.. వైసీపీ మరో సరికొత్త రాజకీయానికి తెరలేపింది. రాష్ట్రవ్యాప్తంగా వాలంటీర్లు మూకుమ్మడి రాజీనామాలు చేస్తున్నారు. వారి విధులకు టీడీపీ ఆటంకం కలిగిస్తుందని ఆరోపిస్తూ రాజీనామా చేస్తున్నారు. తాము ప్రత్యక్షంగానే వైసీపీకి ఎన్నికల్లో సహకరిస్తామని.. వైసీపీ గెలుపుకోసం పని చేస్తామని అంటున్నారు. వైసీపీ సొంత కార్యకర్తలనే వాలంటీర్లుగా నియమించుకుందని ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు ఇప్పుడు నిజం అయ్యాయి.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: జనసేన పార్టీ నేతలకు కీలక ఆదేశాలు ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ఆ నేతలు పాటిస్తారా?

Pawan Kalyan:  పవన్ కళ్యాణ్ లో ఇప్పుడు పరిపూర్ణ రాజకీయ నాయకుడు కనిపిస్తున్నాడు. పార్టీకి సంబంధించి అనేకమైన కీలక నిర్ణయాలను చాలా పరిణితితో తీసుకుంటున్నారు. పోలింగ్ రెండు వారాల్లో ఉంది కాబట్టి ఈ...
- Advertisement -
- Advertisement -