AP People: ఏపీ ప్రజల ఆశ నెరవేరినట్టే.. ఆ దిశగా ముందడుగులు పడుతున్నాయిగా!

AP People: మళ్లీ తెర మీదకి వచ్చిన మూడు రాజధానుల చర్చ. ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మూడు రాజధానుల ఆలోచనకు హైకోర్టు బ్రేక్ వేసిన సంగతి తెలిసిందే. అయితే దీనిని సవాలు చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది అయితే ఎన్నికలలోపు తీర్పువచ్చే అవకాశం ఏమీ కనిపించడం లేదని అభిప్రాయం వ్యక్తం అవుతుంది. అయితే హైకోర్టు తరలింపు పై లోక్ సభలో ప్రస్తావన రావటంతో న్యాయశాఖ మంత్రి ఇచ్చిన సమాధానం మరొకసారి మూడు రాజధాని అంశాన్ని తెర మీదకి తీసుకువచ్చింది.

పార్లమెంట్ సమావేశాలలో అనంతపురం ఎంపీ తలారి రంగయ్య అడిగిన ప్రశ్నకు కేంద్ర న్యాయశాఖ మంత్రి రాతపూర్వకంగా సమాధానం ఇచ్చారు. దీంతో మూడు రాజధానుల ప్రతిపాదన ముందుకు వెళ్లే అవకాశం ఉంటుందన్న ఆశ చిగురిస్తుంది. ఎందుకంటే ఇప్పటివరకు హైకోర్టు మార్పు అనేది రాష్ట్ర ప్రభుత్వం చేతిలో లేదని అది సాధ్యపడదు అన్న భావన ఉండేది.

 

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో ప్రభుత్వం సంప్రదించి నప్పుడు హైకోర్టు మార్పులకు అవసరమైన ఖర్చులు ఏపీ ప్రభుత్వం భరించాలని స్పష్టం చేసింది.అంటే హైకోర్టు మార్పు అసాధారణ నిర్ణయం కాదని ప్రధాని న్యాయమూర్తి ప్రభుత్వం ఒక అవగాహనకు వస్తే హైకోర్టు మార్చుకోవచ్చు అని ఒక నిర్ధారణకి వచ్చినట్లు అయింది. దీంతో జగన్ కోరిక తీరుతుందనే సూచనలు కనిపిస్తున్నాయి. హైకోర్టు రాజధాని లో భాగం కాదు చాలా రాష్ట్రాలలో రాజధాని హైకోర్టు వేరువేరు ప్రాంతాల్లో ఉన్నాయి.

 

అలాగే ప్రస్తుతం అమరావతిలో ఉన్న హైకోర్టు భవనం, హైకోర్టు శాశ్వతం కాదు కాబట్టి ఆర్థిక భారం కూడా పెద్దగా ఉండదు. ఏపీ ప్రభుత్వ నూతన ప్రధాన న్యాయమూర్తితో సంప్రదింపులు జరిపి తాత్కాలిక భవనంలో ఉన్న హైకోర్టును అమరావతి నుంచి కర్నూలు కి మార్పు చేయాలని ప్రతిపాదనలు పంపితే సుప్రీంకోర్టు తీర్పుతో సంబంధం లేకుండా హైకోర్టుని మార్చే అవకాశం ఉంది. అదే గాని జరిగితే హైకోర్టుని మార్చే దిశగా ముందడుగులు వేస్తుంది ఏపీ ప్రభుత్వం.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -