AP Govt: నోటిఫికేషన్ రాకముందే తనిఖీలు.. ఏపీ ప్రభుత్వానికి ఇది న్యాయమేనా?

AP Govt: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలకు సంబంధించి ఇప్పటివరకు నోటిఫికేషన్ వెలువడలేదు. ఏప్రిల్ లేదా మే నెలలో ఎన్నికలు జరిగే అవకాశం అయితే ఉంది. ప్రముఖ సర్వే సంస్థలు చేస్తున్న సర్వేలలో టీడీపీకే ఎడ్జ్ ఉండగా టీడీపీ ప్రకటించిన పథకాలు ఏపీ ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. 2024 ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమికి తిరుగులేదని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

 

అయితే ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే ఏపీలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. సొంత అవసరాల కోసం తీసుకెళ్తున్న డబ్బులను పోలీసులు సీజ్ చేస్తుండటంతో షాకవ్వడం ప్రజల వంతవుతోంది. నెల్లూరు జిల్లాలో తాజాగా ఒక వ్యక్తి బంగారం కొనుగోలు చేయడానికి డబ్బును తీసుకెళ్లగా పోలీసులు ఆ వ్యక్తి డబ్బును సీజ్ చేశారట. కూతురు పెళ్లి కోసం దాచిన డబ్బును పోలీసులు స్వాధీనం చేసుకోవడంతో ఆ వ్యక్తి భయాందోళనకు గురైనట్టు తెలుస్తోంది.

వ్యాపారులు సైతం డబ్బుతో ప్రయాణాలు చేయాలంటే టెన్షన్ పడాల్సి వస్తుందని చెబుతున్నారు. నోటిఫికేషన్ వెలువడిన తర్వాత తనిఖీలు చేస్తే అర్థం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. ఈ ఏడాది మార్చి నెల మూడో వారంలో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే ఛాన్స్ అయితే ఉందని తెలుస్తోంది. అప్పటివరకు ఏపీ ప్రభుత్వానికి తొందర పనికిరాదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

 

ప్రజలను ఇబ్బంది పెట్టేలా జగన్ సర్కార్ వ్యవహరిస్తే ఆ పార్టీనే తీవ్రస్థాయిలో నష్టపోయే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. జగన్ సర్కార్ పోలీసులకు ఏమైనా ఆదేశాలు ఇచ్చి ఉంటే ఆ ఆదేశాలను వెనక్కు తీసుకుంటే మంచిదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఏపీ ప్రభుత్వం సంక్షేమం పేరుతో కొన్ని పథకాలను అమలు చేసి అభివృద్ధి విషయంలో మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించింది.

 

 

ఏపీలో సరైన రోడ్లు లేకపోవడంతో రోజూ వాహనాలలో ప్రయాణం చేసేవాళ్లు నరకం అనుభవిస్తున్నారు. చెత్త బ్రాండ్లకు మద్యం దుకాణాలలో అనుమతులు ఇవ్వడం వల్ల మద్యానికి బానిసై కొంతమంది ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టేస్తున్నారు. రాష్ట్రంలో నిరుద్యోగుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం. మెగా డీఎస్సీ అంటూ జగన్ సర్కార్ చెబుతున్నా అవి మాటలకే పరిమితమయ్యాయి.

 

 

ఎన్నికల ముందు డీఎస్సీ నోటిఫికేషన్ వెలువడినా ప్రిపరేషన్ కు తగినంత సమయం ఇవ్వకపోతే లాభం ఏంటని నిరుద్యోగుల నుంచి ప్రశ్న ఎదురవుతోంది. జగన్ సర్కార్ అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చి ఉంటే టీడీపీ జనసేనకు కనీసం గట్టి పోటీ ఇచ్చే ఛాన్స్ అయితే ఉండేదని నెటిజన్ల నుంచి, ఏపీ ప్రజల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. ప్రజలను ఇబ్బంది పెట్టకుండా ఇకనైనా జగన్ సర్కార్ అడుగులు వేస్తుందేమో చూడాల్సి ఉంది. వైసీపీతో పొత్తు పెట్టుకోవడానికి కూడా ఏ పార్టీ సిద్ధంగా లేదనే సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన 2024 ఎన్నికల్లో 150కు పైగా సీట్లలో విజయం సాధించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి.

 

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -