TDP: టీడీపీది ముగిసిన అధ్యాయమా.. ఇంత దారుణమైన పరిస్థితా?

TDP: టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు టీడీపీ పార్టీ పై పట్టు కోల్పోయారా అంటే ప్రస్తుతం అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. అందుకు గల కారణాలు కూడా లేకపోలేదు. ఒక‌ప్పుడు టీడీపీ అంటే క్ర‌మ‌శిక్ష‌ణ‌కు మారుపేరు. కానీ ఇప్పుడు గ‌తానికి భిన్న‌మైన ప‌రిస్థితి. అయినా ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోలేని నిస్స‌హాయ స్థితిలో బాబు ఉన్నారు. మరొకవైపు టీడీపీ బ‌ల‌హీనత‌ను పార్టీలోని అస‌మ్మ‌తి స్వ‌రాలు ప్ర‌తిబింబిస్తున్నాయ‌నే చ‌ర్చలు కూడా నడుస్తున్నాయి.

విజ‌య‌వాడ ఎంపీ కేశినేని నాని గ‌త కొంత కాలంగా పార్టీలో చోటు చేసుకుంటున్న ప‌రిణామాల‌పై ఘాటు వ్యాఖ్య‌లు చేస్తున్నారు. త‌న‌కు వ్య‌తిరేకంగా సొంత త‌మ్ముడు కేశినేని చిన్నిని ఎగ‌దోల‌డం పై ఆయ‌న మండి ప‌డుతున్నారు. ఇటీవ‌ల పొట్ట‌ల‌ దొర‌కు టికెట్ ఇస్తారేమో అంటూ వ్యంగ్యంగా అన్నారు. తాజాగా చిల‌క‌లూరిపేట టీడీపీ ఇన్‌చార్జ్‌, మాజీ మంత్రి ప‌త్తిపాటి పుల్లారావు పార్టీ వ్య‌వ‌హార‌శైలి పై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. తోపుడు బండ్లు పంపిణీ చేసే వాళ్ల‌కు టికెట్ ఇస్తారా? అంటూ భాష్యం ప్ర‌వీణ్‌ను దృష్టిలో పెట్టుకుని అధిష్టానాన్ని ప్ర‌శ్నించారు. త‌న నియోజ‌క‌వ‌ర్గానికి సంబంధం లేని భాష్యం ప్ర‌వీణ్‌ను ప్రోత్స‌హించ‌డంపై ఆయ‌న మీడియా ముఖంగానే టీడీపీ పెద్ద‌లపై ఆగ్ర‌హించారు.

 

వీటితో పాటు నంద్యాల జిల్లాలో భూమా అఖిల‌ప్రియ‌, ఏవీ సుబ్బారెడ్డి మ‌ధ్య గొడ‌వ బ‌జారుకెక్కింది. ఏవీ సుబ్బారెడ్డిపై లోకేశ్ పాద‌యాత్ర‌లోనే అఖిల‌ప్రియ దాడి చేయించారు. ఈ కేసులో ఆమె వారం రోజుల పాటు జైల్లో ఉన్నారు. త‌న చున్నీని లాగాడంటూ ఏవీపై అఖిల‌ప్రియ ఆరోప‌ణ‌లు చేశారు. అలాగే నంద్యాల‌, ఆత్మ‌కూరు ల‌లో కూడా తాను ప్ర‌చారం చేస్తాన‌ని ఆమె బ‌హిరంగంగా ప్ర‌క‌టించారు. దీంతో ఆ నియోజ‌క‌వ‌ర్గాల్లోని టీడీపీ ఇన్‌చార్జ్‌లు గుర్రుగా ఉన్నారు. ముఖ్యంగా నంద్యాల‌లో భూమా బ్ర‌హ్మానంద‌రెడ్డికి వ్య‌తిరేకంగా వ‌ర్గాన్ని అఖిల‌ప్రియ కూడ‌గ‌డుతున్నారు. అయినా టీడీపీ అధిష్టానం ప్రేక్ష‌క‌పాత్ర పోషించ‌డం త‌ప్ప ఏమీ చేయ‌లేని నిస్స‌హాయ స్థితి. ఇక స‌త్తెనప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జ్‌గా క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ‌ను నియ‌మించ‌డంపై కోడెల శివ‌రామ్ ఫైర్ అయ్యారు. నాలుగేళ్లుగా చంద్ర‌బాబు అపాయింట్‌మెంట్ కోసం తాను, త‌న త‌ల్లి ప్రాథేయ‌ప‌డుతున్నా ఇవ్వ‌లేద‌ని సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. అలాగే క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ‌పై ఆయ‌న ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. కోడెల శివ‌రామ్‌తో చ‌ర్చించ‌డానికి వెళ్లిన టీడీపీ నేత‌ల‌ను శ్రేణులు అడ్డుకోవ‌డం గ‌మ‌నార్హం. ఇలా టిడిపి పార్టీలో జరిగినవన్నీ చూస్తుంటే చంద్రబాబు పార్టీ పై పట్టు కోల్పోయారు అనడానికి ఇవన్నీ చక్కటి నిదర్శనాలు అని చెప్పవచ్చు. అయితే ఇప్పుడు టిడిపి పార్టీలో జరిగిన ఈ విభేదాలన్నీ కూడా బాబు చెక్క దిద్దితే తప్ప ఎన్నికల్లో గెలవడం కష్టం అన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మరి ఈ వివాదాలపై బాబు ఏ విధంగా స్పందిస్తారు, వాటిని ఎలా పరిష్కరిస్తారో చూడాలి మరి.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -