Leo: లియో సినిమాకు ఆర్.ఆర్.ఆర్ సినిమాకు అలాంటి లింక్ ఉందా?

Leo: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నేడు విజయ్ పుట్టినరోజు అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ సందర్భంగా విజయ్ తాజాగా నటిస్తున్న లియో సినిమా నుంచి మూవీ మేకర్స్ ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు. అర్ధరాత్రి ముహూర్తం ఫిక్స్ చేయడంతో కేవలం ఈ పోస్టర్ కోసమే ఫ్యాన్స్ మేలుకుని మరీ ఎదురు చూశారు. చెన్నై రోహిణి థియేటర్ లో ప్రత్యేక సెలబ్రేషన్స్ చేసి పోకిరి స్పెషల్ షో కూడా వేసుకున్నారు. ఈ సినిమాకు లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తుండడంతో అంచనాలు మరింత పెరిగాయి.

 

మల్ హాసన్ నటించిన విక్రమ్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత మూవీ లోకేష్ కనగరాజ్ సహజంగానే బిజినెస్ పరంగా విపరీతమైన క్రేజ్ నెలకొంది. దసరా పండగను లక్ష్యంగా చేసుకున్న లియో మూడు వందల కోట్లకు పైగానే డీల్స్ చేస్తోంది. ఇది ఇలా ఉంటే లియో సినిమాలో విజయ్ పాత్రకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి. సోషల్ మీడియాలో వినిపిస్తున్న వార్తల ప్రకారం లియో మూవీ ఆర్ఆర్ఆర్ కాన్సెప్ట్ కు దగ్గరగా ఉంటుందట.

అంటే ఎన్టీఆర్ రామ్ చరణ్ లను ఎలాగైతే నీరు నిప్పుకు ప్రతినిథులుగా రాజమౌళి చూపించాడో ఇందులో కూడా విజయ్ క్యారెక్టర్ అలాంటి రెండు షేడ్స్ ఇందులో కలిగి ఉంటుందట. అయితే ఇది డ్యూయల్ రోలా లేక ఫ్లాష్ బ్యాక్ లో ఒకటి వర్తమానంలో మరొకటి ఉంటుందా అనేది తెలియాల్సి ఉంది. లియోలో ఎవరైనా ప్యాన్ ఇండియా స్టార్ తో క్యామియో చేయించాలని లోకేష్ విశ్వప్రయత్నం చేస్తున్నట్టుగా తెలిసింది. ఇప్పటికే రామ్ చరణ్ ని అడిగినట్టు కూడా వార్తలు వినిపించాయి. వార్తలు అయితే వినిపించాయి కానీ అదెంత వరకు నిజమో ఇంకో రెండు మూడు నెలలు ఆగితే కానీ క్లారిటీ రాదు. యష్ ని సంప్రదించినప్పటికీ స్పందన రాలేదట. అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్న లియోలో త్రిష హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. తేరి తరహాలో ఇందులో తండ్రి కూతుళ్ళ మధ్య సెంటిమెంట్ మెయిన్ పాయింట్ గా ఉంటుందని చెబుతున్నారు. మొత్తానికి లోకేష్ ఈసారి ఊహలకు మించి ఏదో చేయబోతున్నాడన్న మాట . మరి ఈ లియో సినిమా ఏ మేరకు సక్సెస్ను అందుకుంటుందో చూడాలి మరి.

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -