LEO-Bhagavanth Kesari: లియో మూవీతో పోటీ వల్ల భగవంత్ కేసరి మూవీకి ఏకంగా అన్ని రూ.కోట్ల నష్టమా?

LEO-Bhagavanth Kesari: మామూలుగా పండగ వచ్చింది అంటే చాలు థియేటర్ల వద్ద హంగామా సందడి ఏ విధంగా ఉంటుందో మనందరికీ తెలిసిందే. చిన్న సినిమాలను మొదలుకొని పెద్ద సినిమాల వరకు పండుగలకు కానుకగా విడుదల అవుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలోనే దసరా పండుగ కానుకగా లియో, భగవంత్ కేసరి, టైగర్ నాగేశ్వరరావు సినిమాలు విడుదల అయిన విషయం తెలిసిందే. ఇప్పటికే విడుదలైన ఈ సినిమాలు హిట్ టాక్ ని సొంతం చేసుకున్నాయి. భగవంత్ కేసరికి లియో సినిమా పోటీగా నిలిచింది. ఈ మూవీని కూడా తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు.

ఎందుకంటే, అక్కడున్నది దర్శకుడు లోకేష్ కనగరాజ్. అతడికి తెలుగులో సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. దీనికి తోడు, ఈసారి తెలుగులో లియోకు సితార అండ ఉంది. ఒక స్ట్రయిట్ సినిమాకు ఏమాత్రం తీసిపోని విధంగా థియేటర్లు దక్కాయి. సో భగవంత్ కేసరికి అటు టైగర్ నాగేశ్వరరావుతో పాటు, ఇటు డబ్బింగ్ మూవీ లియో నుంచి కూడా పోటీ తప్పలేదు. అయితే రెండు సినిమాలు సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకున్నప్పటికీ లియో సినిమా వల్ల భగవంత్ కేసరి సినిమా దాదాపుగా 15 కోట్ల వరకు నష్టపోయింది. బాలయ్య బాబు మూవీ బాగానే ఉన్నప్పటికీ లియో మూవీ పోటీ కారణంగా చేసినప్పటికి కాస్త వెనుకబడిపోయిందని చెప్పవచ్చు.

సినిమా విడుదలకు ముందే లియో సినిమా బుకింగ్స్ ఎక్కువగా జరిగిన విషయం తెలిసిందే. కాగా బాలయ్య బాబు నటించిన భగవంత్ కేసరి సినిమా విషయానికి వస్తే.. ఇందులో బాలయ్య బాబు హీరోగా నటించగా కాజల్ హీరోయిన్ గా నటించింది. అలాగే హీరోయిన్ శ్రీ లీల బాలకృష్ణ కూతురి పాత్రలో నటించింది. ఇక లియో సినిమా విషయానికొస్తే.. తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి ఇందులో హీరోగా నటించిన విషయం తెలిసిందే. లోకేష్ కనగరాజ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -