Sankranthi: లియో వర్సెస్ మ్యాడ్.. ఈ సినిమాలలో లియో రేటింగ్ ఎంతో తెలుసా?

Sankranthi: పండగలన్నిటిలోకి సంక్రాంతి పండుగకి ఉన్న ప్రత్యేకతే వేరు. ఈ పండగలో సరదాలకి సంతోషాలకి ఇచ్చే ప్రాధాన్యత ఏంటో అందరికీ తెలిసిందే. ఎక్కడెక్కడో ఉన్న ప్రజలందరూ పండక్కి ఇంటికి చేరుకొని సరదాగా కలిసి కాలం గడుపుతారు అలా ఆనందంగా టైం స్పెండ్ చేయడం కోసం వాళ్ళు సినిమాలనే ఎక్కువగా ఆశ్రయిస్తారు. అందుకే సినిమా వాళ్ళు ఎక్కువగా తమ సినిమాలని సంక్రాంతిలో రిలీజ్ చేయటానికి ఎక్కువగా తాపత్రయ పడుతూ ఉంటారు.

 

అయితే ఈ సంవత్సరం కూడా చాలామంది సంక్రాంతిలో సినిమాల్ని రిలీజ్ చేయడానికి పోటీపడ్డారు అయితే నిర్మాతల విజ్ఞప్తితో కొందరు వెనక్కి తగ్గారు. రిలీజ్ అయిన సినిమాలలో అతి చిన్న బడ్జెట్ తో వచ్చిన హనుమాన్ సినిమా ఎంత ప్రభంజనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. అయితే సంక్రాంతి సమయాల్లో అలాంటి హడావుడి బుల్లితెర మీద కూడా నడుస్తూ ఉంటుంది. ప్రైవేట్ చానల్స్ రేటింగ్ పెంచుకోవడానికి రకరకాల ప్రోగ్రామ్స్ చేస్తూ కొత్త సినిమాలను వారి చానల్స్ లో వచ్చేలాగా చూసుకుంటారు.

అయితే సంక్రాంతిలో వెండి తెర మీద ఎంత పోటీ వాతావరణం, హడావిడి వాతావరణం కనిపిస్తుందో అలాంటి వాతావరణమే బుల్లితెర మీద కూడా కనిపిస్తుంది. అయితే ఎందుకో తెలియదు గానీ ఈ సంవత్సరం జీ తెలుగు, స్టార్ మా చానల్లో సంక్రాంతి వరకు దూరంగా ఉన్నాయి. ఈటీవీ, జెమినీ టీవీ పోటీ పడగా వాటి రేటింగ్స్ తాజాగా బయటకు వచ్చాయి. సంక్రాంతి బరిలో మాడ్ సినిమా విజేతగా నిలిచింది.

 

ఈ సినిమా శాటిలైట్ హక్కులు దక్కించుకున్న ఈటీవీ సంక్రాంతి కానుకగా 15వ తేదీన ఈ సినిమాను ప్రసారం చేసింది. యూత్ ఫుల్ ఎంటర్టైన్ గా థియేటర్లో సక్సెస్ అయిన ఈ మూవీ 4.7 టిఆర్పి తో టీవీలో కూడా క్లిక్ అయింది. అదే రోజు జెమినీ టీవీలో రిలీజ్ అయిన లియో మాత్రం కేవలం 3 టి ఆర్ పి టి తో సరిపెట్టుకుంది. బుల్లితెర మీద కూడా చిన్న సినిమాయే హవా కొనసాగించడం ఈ సంవత్సరం సంక్రాంతి విశేషం

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: జనసేన పార్టీ నేతలకు కీలక ఆదేశాలు ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ఆ నేతలు పాటిస్తారా?

Pawan Kalyan:  పవన్ కళ్యాణ్ లో ఇప్పుడు పరిపూర్ణ రాజకీయ నాయకుడు కనిపిస్తున్నాడు. పార్టీకి సంబంధించి అనేకమైన కీలక నిర్ణయాలను చాలా పరిణితితో తీసుకుంటున్నారు. పోలింగ్ రెండు వారాల్లో ఉంది కాబట్టి ఈ...
- Advertisement -
- Advertisement -