Kushboo: కుష్బూ మతం మారడం వెనుక ఏకంగా ఇంత కథ ఉందా?

Kushboo: ప్రస్తుతం ఎక్కడ్ చూసినా కూడా ది కేరళ స్టోరీ సినిమా పేరు మారుమోగుతోంది. ఈ సినిమాను విమర్శిస్తున్న వారు ఎంతమంది ఉన్నారో ఈ మూవీని సపోర్ట్ చేస్తూ ఆ సినిమాను కచ్చితంగా చూడాలి అని చెబుతున్న వారి సంఖ్య కూడా అంతే ఉంది. ఈ నేపథ్యంలోనే లవ్ జిహాద్ అనే అంశంపై దేశవ్యాప్తంగా కూడా చర్చలు కొనసాగుతున్నాయి.. తాజాగా ఈ వివాదం పై సినీ నటి హీరోయిన్ ఖుష్బూ స్పందించింది. లవ్‌ జీహాద్‌ అంశంపై ఆమెను టార్గెట్ చేస్తున్న వారికి ఖుష్బూ స్ట్రాంగ్‌గా కౌంటర్ ఇచ్చింది ఖుష్బూ.

ఈ సందర్భంగా ఖుష్బూ మాట్లాడుతూ.. వివాహం కోసం నేను మతం మారినట్టు జోరుగా ప్రచారం చేసేవారు కొంచెం తమ జ్ఞానాన్ని పెంచుకోండి. మన దేశంలోని వివాహ చట్టం గురించి కచ్చితంగా వారికి తెలిసి ఉండదు. పెళ్ళి కోసం నేను ఏ ఒక్క మతానికి మారలేదు. మతం మారాలని ఎవరూ నాపై ఒత్తిడి చేయలేదు. నా 23 ఏళ్ల వైవాహిక జీవితం గౌరవం, నమ్మకం, సమానత్వం, ప్రేమకు ప్రతీకగా ఉంది అని ఆమె చెప్పుకొచ్చింది. కాగా ఖుష్బూ కోలీవుడ్ డైరెక్టర్ సుందర్ సి ని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు కూడా ఉన్నారు.

 

ముస్లిం మతానికి చెందిన ఖుష్బూ ప్రస్తుతం జాతీయ మహిళా కమిషన్‌ సభ్యురాలిగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాను వీక్షించిన ఆమె ది కేరళ స్టోరీ సినిమా అందరూ చూడాల్సిన చిత్రం అంటూ ఆమె చెప్పుకొచ్చింది. కాగా ప్రస్తుతం ఖుష్బూ ఇటీవలె సెకండ్ ఇన్నింగ్స్ ని ప్రారంభించి ఒక వైపు బుల్లితెరపై జడ్జ్ గా కొనసాగుతూనే మరొకవైపు వెండితెరపై అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతోంది.

Related Articles

ట్రేండింగ్

AP Recruitments: ఎలాంటి రాతపరీక్ష లేకుండా రూ.50,000 వేతనంతో జాబ్.. ఎలా దరఖాస్తు చేయాలంటే?

AP Recruitments:  నిరుద్యోగులకు శుభవార్త, ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి ఏపీ ప్రభుత్వం జాబ్ నోటిఫికేషన్ ని తీసుకువచ్చింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆరోగ్య వైద్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ జిల్లా...
- Advertisement -
- Advertisement -