Megastar: ఈ మెగాస్టార్ మూవీ సక్సెస్ వెనుక ఇంత కథ ఉందా?

Megastar: టాలీవుడ్ సినీ ప్రేక్షకులకు మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ చిరంజీవి హీరోగా తన కంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకోవడంతో పాటు టాలీవుడ్ లో మెగాస్టార్ గా తనకంటూ ప్రత్యేకమైన మార్క్ ని క్రియేట్ చేసుకున్నారు చిరంజీవి. కేవలం మెగాస్టార్ మాత్రమే కాకుండా మెగా ఫ్యామిలీ నుంచి ఇప్పటికే ఎంతోమంది హీరోలు ఎంట్రీ ఇచ్చి రాణిస్తున్న విషయం తెలిసిందే.. ఇకపోతే చిరంజీవి విషయానికి వస్తే ఆయన ఇప్పటివరకు దాదాపుగా 150 కి పైగా సినిమాలలో నటించిన మెప్పించారు.

ఇప్పటికీ అదే ఊపుతో అదే ఎనర్జీతో సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నారు మెగాస్టార్. ఇక చిరంజీవి తాజాగా నటించిన భోళా శంకర్ సినిమా కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. ఇది ఇలా ఉంటే చిరంజీవి నటించిన ఇండస్ట్రీ హిట్ సినిమాల్లో మహేశ్వరి పరమేశ్వరి బ్యానర్ పై టి. సుబ్బిరామి రెడ్డి నిర్మించిన స్టేట్ రౌడీ సినిమా కూడా ఒకటి. ఈ సినిమాను యాక్షన్ సినిమాల దర్శకుడు బి గోపాల్ తెరకెక్కించాడు. ఈ సినిమాలో చిరంజీవికి జంటగా రాధా, భానుప్రియ హీరోయిన్ లుగా నటించారు. 1989లో విడుదల అయినా ఈ సినిమా మొదటి షోకి నెగిటివ్,ప్లాప్ టాక్‌ ను తెచ్చుకుంది.

 

కానీ చివరకు ఈ సినిమా కలెక్షన్ల పరంగా బాక్సాఫీస్ వద్ద కాసులు వర్షం కురిపించింది. ఆ రోజుల్లోనే ఈ స్టేట్ రౌడీ నైజాంలో కోటి రూపాయలకు పైగా కలెక్షన్లు రాబట్టింది. ఇక ఈ సినిమా వచ్చిన రోజుల్లో బాలీవుడ్లో అమితాబ్ బచ్చన్ సూపర్ క్రేజ్‌తో దూసుకుపోతున్నాడు. ఆ సమయంలో అమితాబ్ తో సినిమా అంటే నిర్మాతలకు కాసులు వర్షం కురిపించేవి. కానీ చిరంజీవి నటించిన స్టేట్ రౌడీ సినిమా మాత్రం అమితాబ్ బచ్చన్ సినిమా కలెక్షన్లు మించి వసూలు చేయడం మరో విశేషం. ఆ రోజుల్లోనే ఈ విషయం చిత్ర పరిశ్రమలో ఎంతో హాట్ టాపిక్ గా మారింది. చిరు స్టేట్ రౌడీ సినిమా ఇంతటి భారీ కలెక్షన్లు సాధించింది..

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -