Viral: ఈ మాస్టార్ నిజంగా దేవుడే.. కళ్లు కనిపించకపోయినా పాఠాలు చెబుతూ?

Viral: మనం నిత్యం ఎంతో మంది చూపు లేని వారిని చూస్తూ ఉంటాం. వారు పడే కష్టాలు వర్ణనాతీతం అని చెప్పవచ్చు. మామూలుగా ఒక్క 10 సెకండ్లు కళ్ళు మూసుకుని 10 అడుగులు వేయాలి అంటేనే ఒకటికి పది సార్లు ఆలోచిస్తూ ఉంటాము. అలాంటిది జీవితాంతం కళ్ళు లేకుండా బతకడం అన్నది నిజంగా ఒక గొప్ప సాహసమే అని చెప్పవచ్చు. అయితే చాలామంది కళ్ళు ఉన్నవారు ఏ పనులు చేయకుండా సోమరిగా బతుకుతుంటే కళ్ళు లేని వారు చదువు నేర్చుకుని ఎంతోమంది విద్యార్థులకు చదువు చెప్పడం అన్నది నిజంగా గొప్ప విషయం.

మీరు విన్నది నిజమే ఒక వ్యక్తి ఒకటి రెండు కాదు దాదాపుగా 27 ఏళ్లుగా కళ్ళు కనిపించకపోయినా విద్యార్థులకు పాఠాలు చెబుతున్నాడు. పూర్తి వివరాల్లోకి వెళితే.. కర్నూలు డోన్ కి చెందిన ఒక వ్యక్తికి పూర్తిగా కళ్ళు కనిపించవు. అయినప్పటికీ చదువు ఉంది అన్న విషయాన్ని అతని తండ్రి గమనించి అప్పట్లోనే కడుపులో ఉన్నావా అందులు ఉన్న స్కూల్ కి పంపించడం జరిగిందట. అయితే అప్పట్లో ప్రత్యేక అందులో పాఠశాల అనేది కేవలం రాయలసీమలో కడపలో మాత్రమే ఉండేదట. అతడు 1990లో పదవ తరగతి పూర్తి చేసి 1992లో ఇంటర్ పూర్తి చేసి, 93 లో టిటిసి పూర్తి చేసి 94 లో డీఎస్సీ రాయిగా 1995లో అతనికి టీచర్ గా ఉద్యోగం వచ్చింది.

 

అయితే అతడు టీచర్గా ఉద్యోగం వచ్చిన రోజుకి కేవలం డిగ్రీ సెకండ్ ఇయర్ మాత్రమే చదవడంతో అంతటితో చదువుని ఆపేయకుండా ఒకవైపు టీచర్ గా బాధ్యతలు కొనసాగిస్తూనే మరొకవైపు చదువుకుంటూ ఉన్నత స్థాయికి ఎదిగాడు. అలా ఇప్పటివరకు అతను దాదాపుగా 27 ఏళ్లుగా పిల్లలకు పాఠాలు చెబుతూనే ఉన్నారు. అలాగే స్కూల్లో పాఠశాలలో క్లాస్ రూమ్ లో పిల్లలు చదువుతున్నారా లేదా అన్నది వినడం ద్వారా తెలుసుకుంటాను. విద్యార్థుల మార్కులను బట్టి వారి గొంతును బట్టి ఎవరు టాపర్ అన్నది కూడా తెలుసుకుంటాను. నాకు ఒక అసిస్టెంట్ ఉన్నారు బోర్డుపై రాయడం పేపర్లు కలెక్షన్ చేయడం లాంటివి చేస్తారు అని చెప్పుకొచ్చారు. పాఠశాలలో ఎవరైనా పిల్లలు అల్లరి చేస్తే వారి గొంతు విని వారిని దగ్గరికి పిలిచి మందలించడం లాంటివి కూడా చేస్తాను అని తెలిపారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -