Pawan Kalyan: ఎన్నికల పోటీ విషయంలో పవన్ కళ్యాణ్ ప్లాన్ ఇదేనా.. ఆ విధంగా చేస్తారా?

Pawan Kalyan: ప్రస్తుతం ఏపీలో అలాగే జనసేన సైనికులలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో గాజువాక నుంచి పోటీ చేస్తారా లేదా అన్న విషయంపై తీవ్ర స్థాయిలో చర్చలు నడుస్తున్నాయి. గత ఎన్నికలలో పవన్ కళ్యాణ్ పోటీ చేసిన విషయం తెలిసిందే. కానీ ఊహించని విధంగా ఓటమి ఎదురయ్యింది. అయితే ఈసారి పోటీ చేస్తే గెలిపించుకుంటామని జనసైనికులు అంటున్నారు. కానీ జనసేన అధినేత పవన్ మాత్రం గాజువాక మీద అంతగా ఆసక్తిని చూపించడం లేదని తెలుస్తోంది.

అంతే కాకుండా గత నాలుగేళ్ల సమయంలో పవన్ కళ్యాణ్ కేవలం రెండుసార్లు మాత్రమే గాజువాక కు వెళ్లారు. ఇది ఇలా ఉంటే తాజాగా మారిన రాజకీయ పరిణామాలను చూసిన వారు అంతా ఆయన భీమవరం నుంచే పోటీ చేస్తారు అని అంటున్నారు. గోదావరి జిల్లాల మీద జనసేన ఎక్కువ దృష్టి పెట్టిందని అంటున్నారు. గాజువాక సీటుని జనసేన పొత్తులో కొరుకుంటోందని, ఆ సీటుని బీసీలకు ఇవ్వడం ద్వారా కాపు ప్లస్ బీసీ కార్డుతో గెలుపు బాటలు వేసుకోవాలని చూస్తోంది అంటున్నారు. పవన్ గాజువాక నుంచి పోటీ చేయాలని ఈసారి కూడా రెండు సీట్లలో పోటీ చేయాలని పార్టీ వారి నుంచి అయితే అభ్యర్ధన వస్తోంది.

 

ఇకపోతే గాజువాక విషయం తీసుకుంటే పవన్ కాకున్నా జనసేనకే టికెట్ పొత్తులో భాగంగా ఆ సీటును కోరుతారు అని అంటున్నారు. దీంతో టీడీపీ తమ్ముళ్లలో టెన్షన్ మొదలయ్యింది. గాజువాక నుంచి సీనియర్ నేత పోటీకి సిద్ధంగా ఉన్నారు. పొత్తులో గాజువాక సీటూ తన ఫేటూ ఎలా ఉందో అన్న ఆందోళన అయితే తెలుగు తమ్ముళ్ళలో ఉందట. మరి ఈ విషయంపై క్లారిటీ రావాలి అంటే పవన్ కళ్యాణ్ స్పందించేంతవరకు వేచి చూడాల్సిందే మరి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -