Telugu People: తెలుగు ప్రజలకు ఇలాంటి పరిస్థితా.. మరీ ఘోరం అంటూ?

Telugu People: దినపత్రికలు అంటే ప్రజలలో ఉన్నటువంటి సమస్యలను తెలియజేస్తూ ఆ సమస్యలను పరిష్కరించే దిశగా ప్రభుత్వాలను ప్రోత్సహించడమే దినపత్రికల పని.పత్రికలు అంటే ప్రజల కోసం పనిచేస్తాయని నమ్మకం ఉండాలి కానీ సొంత లాభం కోసం పనిచేస్తాయనే అసహనం ఉండకూడదు.ఒకప్పటి వార్తాపత్రికలు ప్రజల కోసమే పని చేసే లాగా ఉండేవి అయితే ప్రస్తుతం సొంత లాభం కోసమే పత్రికలు పనిచేస్తున్నాయని తెలుస్తుంది. ప్రస్తుతం అధిక మొత్తంలో సర్కిలేట్ అవుతున్నటువంటి దినపత్రికలలో ఈనాడు సాక్షి వంటి పత్రికలు మొదటి స్థానంలో ఉన్నాయి అయితే ఈ రెండు పత్రికలు కూడా ఎవరి ధోరణిలో వారు ప్రజా సమస్యలను పట్టించుకోకుండా సొంత లాభం కోసమే ప్రయత్నాలు చేస్తున్నారు.

ప్రముఖ వార్తాపత్రిక ఈనాడు వార్తాపత్రికలో ప్రస్తుతం మనం చూస్తే కనుక మార్గదర్శి కేసులో భాగంగా సిఐడి దర్యాప్తు చేస్తున్న విషయం మనకు తెలిసిందే. అయితే ఈ దర్యాప్తులో రామోజీరావును పెద్ద ఎత్తున అధికారులు విచారణ చేపడుతున్నారు. ఈ క్రమంలోనే పలువురు చార్టెడ్ అకౌంట్లతో సమీక్షలు నిర్వహించి మార్గదర్శి చిట్ ఫండ్స్ లో తమ తప్పు ఏమీ లేదని ఈ కేసు నుంచి తప్పించుకోవడం కోసం రామోజీరావు అండ్ టీం ఎంతో కృషి చేస్తుంది.

 

ఈ క్రమంలోనే ఈ కేసు నుంచి తప్పించుకోవడం కోసమే ఈనాడు వార్త పత్రిక మార్గదర్శి విషయంలో తమ తప్పు లేదన్నట్టు పెద్ద ఎత్తున వార్తలను ప్రచురిస్తోంది. ఇక సాక్షి విషయానికి వస్తే తామేమి తక్కువ కాదన్నట్టు వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో తమ తప్పులేదు అంటూ ప్రచురిస్తున్నాయి. వివేకానంద రెడ్డి హత్య కేసులో సిబిఐ దర్యాప్తు వేగవంతమైన విషయం మనకు తెలిసిందే. ఇప్పటికే వైయస్ భాస్కర్ రెడ్డిని సిబిఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

 

నేడో రేపో వైయస్ అవినాష్ రెడ్డి కూడా అరెస్ట్ కానున్నారు. ఈ క్రమంలోనే వైయస్ అవినాష్ రెడ్డి అరెస్టు కాకుండా ఉండటం కోసమే తన తప్పు ఏమాత్రం లేదని సాక్షి ప్రచురించడం గమనార్హం. వైయస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీత ఆయన అల్లుడు చెప్పిన విధంగానే సిబిఐ వ్యవహరిస్తున్నారని, వివేకానంద రెడ్డి హత్య గురించి అవినాష్ పోలీసులకు వెల్లడించారని ఆయన తప్పు ఉంటే పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేస్తారంటూ అవినాష్ తప్పు లేదని చూపిస్తూ వార్తలను ప్రచురిస్తున్నారు. ఇలా సాక్షి ఈనాడు స్వలాభం కోసం వారు వార్తలను రాసుకుంటున్నారు తప్ప ప్రజాక్షేమం కోసం వార్తలను ప్రచురించడం లేదని స్పష్టం అవుతుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -