Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేస్తున్న అతిపెద్ద తప్పు ఇదేనా?

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాలలో చాలా చురుగ్గా పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే ఈయన వారాహి యాత్ర చేపట్టిన సంగతి మనకు తెలిసిందే. ఇలా వారాహి యాత్రలో భాగంగా తూర్పుగోదావరి జిల్లాలో పెద్ద ఎత్తున పర్యటన చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ ఈ యాత్రలో భాగంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ తనపై తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపిస్తున్నారు.

ఇలా పవన్ కళ్యాణ్ జగన్ పై విమర్శలు చేయడమే కాకుండా వచ్చే ఎన్నికలలో జగన్ ప్రభుత్వం అధికారంలోకి రాకుండా మట్టికరిపించాలనీ పిలుపునిస్తున్నారు. జగన్ ప్రస్తావన పక్కన పెడితే వారాహి యాత్రలో భాగంగా ఈయన చేస్తున్న పని అందరిని కాస్త విస్మయానికి గురిచేస్తుంది. సాధారణంగా ఒక నాయకుడు ఒక నియోజకవర్గానికి వెళ్లి పర్యటిస్తున్నారు అంటే తప్పనిసరిగా ఆ నియోజకవర్గానికి సంబంధించిన ఆ పార్టీ నాయకుడు తన వెంట నడవడం మనం చూస్తుంటాము. అలాగే ఏదైనా బస్సు యాత్ర చేపట్టిన ఆ వాహనంపై ఆ నియోజకవర్గానికి సంబంధించిన నాయకులు ఉంటారు.

 

ఈ విధంగా సదరు నాయకులను పక్కన పెట్టుకొని ప్రసంగం చేస్తే ఆ నాయకుడిపై ప్రజల ఫోకస్ కూడా పడుతుంది కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఒంటరిగా యాత్ర చేపట్టారు. ఆయన మాట్లాడుతున్న సమయంలో వారాహి వాహనంపై తను మాత్రమే కనిపిస్తున్నారు. అయితే ఆ పార్టీకి తాను మాత్రమే నాయకుడని పవన్ కళ్యాణ్ అహంకారం ప్రదర్శించడం వల్లే ద్వితీయ శ్రేణి నాయకులను కనీసం తన పక్కన నిలబెట్టుకోవడానికి కూడా ఇష్టపడటం లేదని తెలుస్తోంది.

 

ఈ విధంగా పవన్ కళ్యాణ్ ఆ నియోజకవర్గ నాయకులను తన పక్కన పెట్టుకుంటే వారిపై అందరి చూపు పడటం వల్ల వారే ఎలివేట్ అవుతారన్న భయం తనలో ఉందా లేకపోతే తన పార్టీకి తాను మాత్రమే నాయకుడు అన్న అహంకారం ఉందో తెలియదు కానీ ఈయన మాత్రం ద్వితీయ శ్రేణి నాయకులను పట్టించుకోకపోవడంతో పవన్ కళ్యాణ్ పార్టీకి ఇలాంటి దుస్థితి ఏర్పడిందని పలువురు భావిస్తున్నారు. ఇలా ప్రాంతీయ నాయకులను పక్కన పెట్టుకొని ప్రసంగించే అంత ధైర్యం పవన్ కళ్యాణ్ కు లేదా అంటూ మరికొందరు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -